Chiranjeevi: డైలాగులు నేర్చుకోవాలా.. నటనపై దృష్టి పెట్టాలా ఫైర్ అయిన చిరు?

  • July 25, 2022 / 05:44 PM IST

ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో స్వయంకృషితో నేడు తెలుగు సినిమా ఇండస్ట్రీని శాసించే స్థాయికి ఎదిగిన నటుడు మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్ని సంవత్సరాల పాటు ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ తిరిగి ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చారు.ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా సినిమాని తెలుగులో తన సమర్పణలు విడుదల చేయడానికి సిద్ధమయ్యారు.

ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో అమీర్ ఖాన్ కరీనాకపూర్ జంటగా నటించిన ఈ సినిమా ఆగస్టు 11వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి చిత్ర బృందంతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మెగాస్టార్ అమీర్ ఖాన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. అమీర్ ఖాన్ ఎంతో విభిన్నమైన పాత్రలు చేస్తారని తను అలాంటి పాత్రలలో నటించలేనని తేల్చి చెప్పారు..

ఇదిలా ఉండగా ఈ కార్యక్రమంలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ దర్శకులపై చిరు కోపం ప్రదర్శించారు. ప్రస్తుత కాలంలో ఇండస్ట్రీలో డైరెక్టర్ల తీరుపై ఈయన మాట్లాడుతూ డైరెక్టర్ల గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ కొంతమంది డైరెక్టర్లు అప్పటికప్పుడు లొకేషన్లో డైలాగులు రాస్తూ నటీనటులకు ఇస్తున్నారనీ తెలిపారు.ఇలా షూటింగ్ లొకేషన్లో అప్పటికప్పుడు డైలాగులు రాసి ఇస్తే వాళ్ళు డైలాగులు నేర్చుకుంటారా?

లేకపోతే నటనపై దృష్టి పెట్టాలా? అంటూ చిరంజీవి దర్శకులపై ఫైర్ అయ్యారు. ఇలా డైరెక్టర్లు తీరు వల్ల కొంతమంది నటీనటులు ఎంతో ఇబ్బంది పడుతున్నారని డైరెక్టర్లు తమ ధోరణి మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మెగాస్టార్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో పలు చర్చలకు కారణమయ్యాయి. అలాగే ఈయన చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus