మెగాస్టార్ చిరంజీవిని ఇండస్ట్రీకి పరిచయం చేసిన గుడిపాటి రాజ్ కుమార్ ఈరోజు హైదరాబాద్ లో మరణించారు. ఈయన వయసు 75 ఏళ్ళు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కనీసం ఈయనకి ఎటువంటి ఆస్తులు లేవట. రక్తపు విరేచనాలు, గుండెకు వేసిన స్టెంట్ లతో ఈయన ఇప్పటి వరకూ ఇబ్బంది పడుతూ వచ్చినట్టు తెలుస్తుంది. ఆయన అనారోగ్యానికి చికిత్సకు మరియు మెడిసిన్ కు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో మెగాస్టార్ చిరంజీవి ఈయన్ని అపోలో ఆసుపత్రిలో చేర్పించి ట్రీట్మెంట్ ఇప్పించారు. ఇక టాలీవుడ్ దర్శకులు పూరీ జగన్నాధ్, మెహర్ రమేష్.. వంటి వారు ముందుకొచ్చి ఆర్థిక సాయం కూడా అందించారు.
ఇక ఈయన చిరంజీవి నటించిన ‘పునాది రాళ్లు’ చిత్రానికి రైటర్ గాను అలాగే దర్శకుడుగాను పనిచేసారు. 1979లో విడుదలైన ఈ చిత్రానికి ఏకంగా 5 నంది అవార్డులు వరించాయి. ఇక రాజ్ కుమార్ భౌతిక కాయాన్ని … కృష్ణాజిల్లాకు చెందిన ఆయన సొంత ఊరు ఉయ్యూరుకు తరలిస్తున్నట్టు సమాచారం. రాజ్ కుమార్ మృతితో టాలీవుడ్ లో విషాద ఛాయలు అల్లుకున్నాయి.