Chiranjeevi, Vaishnav Tej: ఆ తేదీనే నమ్ముకున్న వైష్ణవ్ తేజ్!
February 12, 2022 / 11:37 PM IST
|Follow Us
తొలి సినిమా ఉప్పెనతో వైష్ణవ్ తేజ్ రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించిన సంగతి తెలిసిందే. మొదటి సినిమాతో మరే తెలుగు హీరో సాధించని స్థాయిలో వైష్ణవ్ రికార్డులను క్రియేట్ చేసి ప్రశంసలను అందుకున్నారు. వైష్ణవ్ తర్వాత సినిమాలు కూడా విజయం సాధిస్తే ఈ హీరో స్టార్ హీరో స్టేటస్ ను సొంతం చేసుకోవడం గ్యారంటీ అనే కామెంట్లు వినిపించాయి. అయితే కొండపొలం సినిమా ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశపరిచింది. ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ రంగ రంగ వైభవంగా సినిమాలో నటిస్తున్నారు.
ఈ సినిమా మే నెల 27వ తేదీన రిలీజ్ కానున్నట్టు మేకర్స్ నుంచి ప్రకటన వెలువడింది. సమ్మర్ లో సినిమాను రిలీజ్ చేయడం ద్వారా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ స్థాయిలో కలెక్షన్లను సాధించే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. వైష్ణవ్ తేజ్ కు జోడీగా ఈ సినిమాలో కేతిక శర్మ నటించారు. అయితే మే 27వ తేదీన విడుదలైన చిరంజీవి సినిమా మెకానిక్ అల్లుడు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. 1993 సంవత్సరం మే నెల 27వ తేదీన మెకానిక్ అల్లుడు సినిమా విడుదలైంది.
బి.గోపాల్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కగా అక్కినేని నాగేశ్వరరావు ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు. భారీ బడ్జెట్ తో, భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో ఫెయిలైంది. మెకానిక్ అల్లుడు రిలీజైన రోజునే తన సినిమా రిలీజవుతుండటంతో వైష్ణవ్ తేజ్ ఫ్లాప్ సెంటిమెంట్ ను బ్రేక్ చేసి సక్సెస్ ను సొంతం చేసుకుంటారేమో చూడాలి. రంగ రంగ వైభవంగా సినిమాకు గిరీశయ్య దర్శకత్వం వహిస్తుండగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది.
రంగ రంగ వైభవంగా సినిమాతో వైష్ణవ్ తేజ్ కచ్చితంగా సక్సెస్ సాధించాల్సి ఉంది. భోగవల్లి ప్రసాద్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఉప్పెన స్థాయిలో ఈ సినిమా సక్సెస్ సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.