మొగల్తూరులో చిరంజీవి ఇల్లు అమ్ముకున్నది ఎవరు? అసలు మేటర్ ఇదేనట..!
October 21, 2022 / 08:21 PM IST
|Follow Us
మొగల్తూరులో చిరంజీవి గురించి రకరకాల కామెంట్లు వినిపిస్తుంటాయి. ముఖ్యంగా ఆయన ఇంటిని గ్రామస్తులు లైబ్రరీ కోసం ఇవ్వకుండా కేవలం రూ.3 లక్షలకు అమ్ముకున్నారనే ఆరోపణలు చాలా కాలంగా వినిపిస్తూనే ఉన్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉందనే ప్రశ్న అందరిలోనూ ఉంది. దానికి ఇటీవల సమాధానం దొరికింది. ఈ విషయం పై సీనియర్ జర్నలిస్ట్ ప్రభు ఓ ఇంటర్వ్యూలో స్పందించి క్లారిటీ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ” ప్రజారాజ్యం పార్టీ టైంలో చిరంజీవి గారి పై బురదజల్లడానికి బాగా పనికొచ్చిన అంశం ఇది.
నిజానికి మొగల్తూరులో చిరంజీవి గారికి ఎటువంటి ఇల్లు లేదు . స్థలం కూడా ఏమీ లేదు. మొగల్తూరు అనేది ఆయన పుట్టిన ఊరు మాత్రమే. వాళ్ల నాన్నగారు ఉద్యోగ రీత్యా అనేక ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ అవుతూ చివరికి ఈ ఊళ్ళో కూడా పనిచేయడం జరిగింది. కాబట్టి వాళ్లకి ఒక స్థిరమైన ఇల్లు అనేది లేదు. మొగల్తూరులో ఉన్నది చిరంజీవి గారి తాత గారి ఇల్లు. చిరంజీవి గారు రాజకీయాల్లోకి రావడానికి పూర్వమే ఆ ఇంటిని వాళ్లు అమ్మేసుకోవడం జరిగింది.
దానికి, చిరంజీవి గారికి ఎలాంటి సంబంధం లేదు.చిరంవిగారిది కాని ఒక ఇల్లు ఆయనదని పుట్టించి .. 3 లక్షలకి ఆశపడి అమ్మేశారనే ఒక పుకారుని పుట్టించారు.అందుకే ఆయన ఈ విషయం పై స్పందించలేదు. తన స్థాయికి తగని విషయాలు ఆయన పట్టించుకోరు.మొదటి నుండి ఆయనకు ఆ అలవాటు లేదు. ఇలాంటి ప్రచారాలను ఖండించే ప్రయత్నం కూడా ఆయన చేయరు. అందుకే ఈ ప్రచారం చాలా కాలం జరిగింది.
రాజకీయ పరమైన ఒత్తిళ్లు ఎదురైనప్పుడు కూడా ఆయన ఈ విషయంపై స్పందించలేదు. ఇంకో విషయం ఏంటంటే…1998 నాటికే చిరంజీవిగారి పేరు పై మొగల్తూరులో గ్రంథాలయం ఉంది. ఆ విషయం చాలా మందికి తెలిసుండదు. తెలిసినా మాట్లాడి ఉండరు” అంటూ చెప్పుకొచ్చారు ప్రభు. ఇక చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. ఈ మధ్యనే ఆయన ‘గాడ్ ఫాదర్’ తో సందడి చేసిన సంగతి తెలిసిందే.