Chiranjeevi: సర్జరీ పూర్తి అప్పటివరకు కొత్త సినిమాకు దూరంగా మెగాస్టార్!
August 16, 2023 / 06:40 PM IST
|Follow Us
మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో ఏమాత్రం విరామం లేకుండా వరుస సినిమాలలో నటించినటువంటి చిరంజీవి అనంతరం రాజకీయాలలోకి వచ్చారు.అయితే రాజకీయాలలో ఈయన సక్సెస్ కాకపోవడంతో కొంతకాలం పాటు సినిమాలకు దూరమయ్యారు. దీంతో తిరిగి ఎంట్రీ ఇచ్చారు. ఈ విధంగా చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మరోసారి తన సినిమా స్టామినా ఏంటో అందరికీ పరిచయం చేశారు.
ఇలా రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలలో నటిస్తున్నటువంటి చిరంజీవి (Chiranjeevi) తాజాగా భోళా శంకర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.అయితే ఈ సినిమా తర్వాత చిరంజీవి వెంటనే తన తదుపరి సినిమాను ప్రకటించబోతున్నారనీ వార్తలు వచ్చాయి. చిరంజీవి తన తదుపరి చిత్రాన్ని కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తన కుమార్తె సుస్మిత నిర్మాణ సంస్థలో సినిమా చేయబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమా మరి కాస్త ఆలస్యం కానుందని తెలుస్తుంది.
మెగాస్టార్ చిరంజీవి గత కొద్ది రోజులుగా తీవ్రమైన మోకాలు నొప్పి సమస్యతో బాధపడుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. నొప్పి నుంచి ఉపశమనం పొందాలి అంటే సర్జరీ చేయాలని వైద్యులు సూచించినట్టు తెలిపారు. ఈ క్రమంలోనే చిరంజీవి మోకాలు నొప్పికి సర్జరీ కూడా చేయించుకున్నారని తెలుస్తుంది.ఢిల్లీలో ఆర్దోస్కోపి నీ వాష్ ట్రీట్మెంట్ తీసుకున్నారట. ఇక మోకాలి సర్జరీ విజయవంతంగా పూర్తి కావడంతో ఆయన ఓ వారం విశ్రాంతి తీసుకొని తిరిగి హైదరాబాదు రానున్నట్లు తెలుస్తోంది.
మోకాలి సర్జరీ కావడంతో చిరంజీవి రెండు నెలల పాటు విరామం తీసుకోవాలని వైద్యులు సూచించారట. ఇలా రెండు నెలలు విశ్రాంతి తీసుకున్న తరువాతనే చిరంజీవి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రాబోతున్న సినిమా షూటింగ్ పనులు ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది.