Chiranjeevi: చిన్న సినిమాలకు చిరు సెంటిమెంట్.. వాళ్లను మెగాస్టార్ ప్రోత్సహిస్తారా!
January 17, 2024 / 04:56 PM IST
|Follow Us
మెగాస్టార్ చిరంజీవి సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇప్పుడు స్టార్ స్టేటస్ తో ఒక వెలుగు వెలుగుతున్న ఎంతోమంది సెలబ్రిటీలు మేము చిరంజీవి అభిమానులమని చెప్పుకుంటారు. చిన్న సినిమాలకు తన వంతు సహకారం అందించే చిరంజీవి హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరు కావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. హనుమాన్ సక్సెస్ వెనుక చిరంజీవి పాత్ర కొంత ఉందని అందరూ అంగీకరించాల్సిందే. చిన్న సినిమాలకు సెంటిమెంట్ గా మారిన చిరంజీవి రాబోయే రోజుల్లో మరిన్ని చిన్న సినిమాలను ప్రోత్సహిస్తారేమో చూడాల్సి ఉంది.
హనుమాన్ మూవీకి ఈరోజు కూడా అదిరిపోయే స్థాయిలో బుకింగ్స్ జరుగుతున్నాయి. మరికొన్ని రోజుల పాటు హనుమాన్ హవాకు బ్రేకులు వేయలేరని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఫిబ్రవరి 9వ తేదీన సినిమాలు విడుదలయ్యే వరకు హనుమాన్ మూవీ రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించే ఛాన్స్ అయితే ఉంది. హనుమాన్ మూవీ లాంగ్ రన్ లో కలెక్షన్ల పరంగా మరిన్ని రికార్డ్ లను సొంతం చేసుకుంటుందని చెప్పవచ్చు.
ఇప్పటికే 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకున్న ఈ సినిమా రాబోయే రోజుల్లో 200 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంటుందేమో చూడాలి. ఇతర రాష్ట్రాల్లో సైతం ఈ సినిమాకు బుకింగ్స్ అదుర్స్ అనేలా ఉన్నాయి. ముంబైలోని ప్రముఖ థియేటర్లలో ఈ సినిమా బుకింగ్స్ వేరే లెవెల్ లో ఉన్నాయి. హనుమాన్ సీక్వెల్ గా జై హనుమాన్ తెరకెక్కుతుండగా ఈ సినిమాలో ఎవరు ప్రధాన పాత్రలో కనిపిస్తారనే ప్రశ్నకు సంబంధించి సమాధానం దొరకాల్సి ఉంది.
ప్రశాంత్ వర్మ భవిష్యత్తు ప్రాజెక్ట్ లకు సైతం నిరంజన్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించే అవకాశం ఉంది. ప్రశాంత్ వర్మ భవిష్యత్తులో టాలీవుడ్ స్టార్స్ తో పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కించి విజయాలను అందుకుంటారేమో చూడాలి. హనుమాన్ మూవీకి రాబోయే రోజుల్లో అదనంగా థియేటర్లు దక్కనున్నాయని సమాచారం అందుతోంది. హనుమాన్ సినిమాకు థియేటర్లు పెరిగితే ఈ సినిమాకు కలెక్షన్లు పెరిగే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు.