Chiranjeevi: హీరోయిజం గురించి చిరంజీవి అలా అన్నారా? ఎందుకన్నారో?
October 13, 2023 / 04:55 PM IST
|Follow Us
‘భోళా శంకర్’ సినిమా డిజాస్టర్ తర్వాత చిరంజీవి పెద్దగా బయటకు వచ్చింది లేదు. కొత్త సినిమా కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు కూడా. శస్త్రచికిత్స జరగడం ఒక కారణమైతే.. కొత్త సినిమా పనులు ఇంకా ఓ కొలిక్కి రాకపోవడం మరో కారణం అంటున్నారు. అయితే చిరంజీవి ఇటీవల కాలంలో మీడియాలో కనిపించింది మాత్రం ఒకసారే. ప్రముఖ పాత్రికేయుడు వినాయకరావు రాసిన ఓ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అయితే ఆ సందర్భంలో చిరంజీవి పిచ్చాపాటీగా మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు అంటున్నారు.
చిరంజీవిని సీనియర్ పాత్రికేయులు కలసినప్పుడు నాటి రోజుల గురించి మాట్లాడటం ఆయనకు అలవాటు. ప్రస్తుతం ట్రెండ్ ఎలా ఉంది? ఒకప్పుడు ఎలా ఉంది? అనే విషయాలను చర్చిస్తుంటారంటారు. అలా ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ఉన్న ఓ టాపిక్ గురించి చర్చ వచ్చింది అంటూ సోషల్ మీడియాలో ఓ మాట కనిపిస్తోంది. సినిమాల్లో ఇప్పుడున్న హీరోయిజం పోకడల గురించి చిరు మాట్లాడారు అనేది ఆ మాటల సారాంశం.
లేటు వయసులో ఒళ్లు హూనం చేసుకుని డాన్సులు ఫైట్లు కాకుండా ఊరికే అలా నడుచుకుంటూ వెళ్తే, డైలాగులు చెబితే హీరోయిజం అయిపోతుంది. అయితే ఆ సీన్‌కు సంగీత దర్శకుడు రీ రికార్డింగ్‌తో ఎలివేషన్లు యాడ్ చేయాలి అనే అర్థం వచ్చేలా చిరంజీవి మాట్లాడారు అంటున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియడం లేదు కానీ… ఆయన అన్న మాటలు మాత్రం సీనియర్ స్టార్ హీరోలను ఉద్దేశించే అంటున్నారు నెటిజన్లు.
సినిమాలో విషయం కంటే బ్యాగ్రౌండ్ స్కోర్‌తోనే సినిమాను పైకి లేపుతున్నారు అంటూ ఓ డిస్కషన్ ఈ మధ్య నడుస్తోంది. ‘జైలర్’ సినిమా విషయంలో అదే మాట వినిపించింది. అంతకుముందు తెలుగులో కూడా ఇలాంటి మాటలు విన్నాం. అంతెందుకు ‘గాడ్ ఫాదర్’ పరిస్థితి కూడా అంతే. దీంతో ఇవన్నీ కలిపి చిరంజీవి అలా అన్నారు అని అంటున్నారు. అయితే నిజంగా చిరంజీవి (Chiranjeevi) ఇలానే అన్నారా? ఎవరినైనా ఉద్దేశించే అన్నారా అనేది తెలియాల్సి ఉంది.