‘లూసీఫర్’ రీమేక్ కు మెగాస్టార్ కోరుతున్న మార్పులు…!
April 27, 2020 / 05:16 PM IST
|Follow Us
గతేడాది విడుదలైన మోహన్ లాల్… ‘లూసిఫర్’ చిత్రం ఎంత సూపర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగులో కూడా ఈ చిత్రాన్ని అదే పేరుతో డబ్ చేసారు.అయినప్పటికీ తెలుగులో ఈ చిత్రాన్ని రీమేక్ చెయ్యాలని రాంచరణ్ రైట్స్ కొనుగోలు చేసారు. తెలుగులో ఈ చిత్రం డబ్ అయినా కూడా ఎందుకు మళ్ళీ రీమేక్ చేస్తున్నారు అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే గతంలో ‘వీరం’ మరియు ‘జిగర్తాండ’ చిత్రాలను తెలుగులో డబ్ చేసినప్పటికీ ‘కాటమరాయుడు’ ‘ గద్దలకొండ గణేష్’ పేర్లతో మళ్ళీ రీమేక్ చేసారు.
మాస్ ప్రేక్షకులు ఆ చిత్రాల్ని చూసారు కానీ క్లాస్ ఆడియన్స్ పెద్దగా పట్టించుకోలేదు. ఇంకో విచిత్రం ఏమిటి అంటే అవి రెండూ మెగా హీరోల చిత్రాలే. ఇప్పుడు మరోసారి తెలుగులో డబ్ అయిన ‘లూసీఫర్’ ను రీమేక్ చేస్తుంది కూడా మెగా హీరోలే కావడం విశేషం. అయితే ఈ రీమేక్ కు ‘సాహో’ ఫేమ్ సుజీత్ డైరెక్ట్ చేస్తుండగా.. మెగాస్టార్ చిరంజీవి కొన్ని మార్పులు కొరారట. అవి ఏమిటంటే… ‘లూసీఫర్’ లో పొలిటికల్ టచ్ ఎక్కువ ఉంటుంది.
మెగాస్టార్ ఇప్పుడు పాలిటిక్స్ కు దూరంగా ఉంటున్నారు కాబట్టి.. ఆ ట్రాక్ ను తగ్గించమని కోరారట. అంతే కాదు ‘లూసీఫర్’ లో సవతి తమ్ముడు క్యారెక్టర్ కూడా ఉంటుంది. దానిని ఇంకాస్త పెంచమని మెగాస్టార్ కోరినట్లు తెలుస్తుంది. అంతేకాదు లవ్ అండ్ కామెడీ అలాగే డ్యాన్స్ లకు స్కోప్ ఎక్కువ ఉండేలా చూడమని మెగాస్టార్ కోరారట.