Chiranjeevi: ఆ టైమ్ లో మెగాస్టార్ సినిమా ఎంత వసూలు చేసిందో తెలిస్తే షాక్ అవుతారు?
May 31, 2023 / 11:56 AM IST
|Follow Us
మెగాస్టార్ కెరీర్ లో హిట్స్ తోపాటు ఫ్లాప్స్ కూడా ఉన్నాయనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆయన కొన్ని ఫ్లాప్ సినిమాలు కొన్నేళ్ల తర్వాత టీవీ టెలికాస్ట్ లో మంచి రెస్పాన్స్ ని దక్కించుకున్నవి కూడా ఉన్నాయి. అలాంటి చిత్రాలలో ఒకటి అంజి. భారీ బడ్జెట్ తో కనీవినీ ఎరుగని రేంజ్ గ్రాఫిక్స్ తో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం లో బడ్జెట్ కారణంగా కొంత భాగం షూటింగ్ పూర్తి అయ్యి మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది.
ఆ తర్వాత చిరంజీవి (Chiranjeevi) హీరో గా నటించిన ఇంద్ర మరియు ఠాగూర్ సినిమాలు సంచలన విజయం సాధించడంతో ఈ చిత్రానికి ఫైనాన్స్ చెయ్యడానికి పెట్టుబడి దారులు ముందుకొచ్చారు. అలా రెండేళ్ల పాటు ఆగిపోయిన షూటింగ్ ని మళ్ళీ తిరిగి ప్రారంభించి సినిమాని పూర్తి చేసారు. రెండు భారీ హిట్స్ తర్వాత వచ్చిన సినిమా కావడం తో అంజి చిత్రం పై అంచనాలు మామూలు రేంజ్ లో ఉండేవి కాదు అప్పట్లో.
అలా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి మొదటి ఆట నుండే నెగటివ్ టాక్ వచ్చింది. సినిమాలో గ్రాఫిక్స్ అద్భుతంగానే ఉన్నాయి కానీ, ఎక్కడో ఎదో లోపం ఉందని, చాలా సన్నివేశాలు బోర్ కొట్టాయని అనుకునేవారు అప్పట్లో. అయితే నేటి తరం కుర్రాళ్ళు ఈ చిత్రంలోని గ్రాఫిక్స్ చూసిన తర్వాత ఆరోజుల్లో డైరెక్టర్ కోడి రామకృష్ణ కి ఇంత విజన్ ఉండేదా?, నమ్మశక్యం గా లేదే అని ఆశ్చర్యపోక తప్పదు.
ఈ చిత్రం లో మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ హీరోయిన్ గా నటించింది. ఆమెకి ఇదే చివరి చిత్రం కావడం విశేషం, అప్పటికే ఆమెకి మహేష్ బాబు తో పెళ్లి అయిపోయింది. కానీ చిరంజీవి స్పెషల్ రిక్వెస్ట్ కారణంగా ఈ సినిమా చేసింది. అయితే ఈ సినిమాకి అప్పట్లో ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ కూడా, కలెక్షన్స్ పరంగా సుమారుగా 17 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసిందని సమాచారం.