Chiranjeevi, Rajinikanth: ‘ఆచార్య’ రిలీజ్‌ డేట్‌ అదే అంటున్నారు!

  • September 1, 2021 / 02:29 PM IST

విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు ఎక్కువైపోవడంతో… సీజన్‌ కోసం హీరోలందరూ ఎదురుచూస్తున్నారు. అందుకే రాబోయే పండగ సీజన్లన్నీ బిజీగా మారిపోయాయి. దీని వల్ల ఫస్ట్‌ కమ్‌ ఫస్ట్‌ సెర్వ్‌ అనే పద్ధతి కనిపిస్తోంది. ఎవరు ముందుగా అనౌన్స్‌ చేస్తే వాళ్ల సినిమాలే వస్తున్నాయి. ఈ క్రమంలో సీనియర్‌ హీరోల సినిమాల డేట్స్‌ దొరకడం లేదనే టాక్‌ వినిపిస్తోంది. అలాంటి సినిమాల్లో ‘ఆచార్య’ ఒకటి. ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారో చిత్రబృందం చెప్పలేకపోతోంది.

అయితే ఇండస్ట్రీ టాక్‌ ప్రకారం చూస్తే… సినిమాకు రాబోయే రెండు సీజన్లు అందుబాటులో లేవట. వినాయకచవితికి సినిమా వచ్చే అవకాశం లేదు. ఇక దసరా సీజన్‌ విషయంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నిర్ణయం బట్టి స్పష్టత వస్తుంది. అయితే ఆ సినిమా తప్పుకుంటే రావడానికి చాలా సినిమాలున్నాయి. అందులో ‘ఆచార్య’ లేదంటున్నారు. దీంతో ఇక మిగిలింది దీపావళి సీజన్‌. ఆ సందర్భంలోనే సినిమాను ‘ఆచార్య’ను తీసుకొస్తారని కొత్త టాక్‌. ఒకవేళ దీపావళికి మెగాస్టార్‌ వస్తాను అంటే…

బాక్సాఫీసు దగ్గర ఆసక్తికర పోరు ఖాయమనే చెప్పాలి. ఎందుకంటే దీపాల పండగకు రజనీకాంత్‌ ‘అన్నాతె’తో రాబోతున్నాడు. చాలా రోజుల క్రితమే ఆ సినిమా రిలీజ్‌ డేట్‌ను అనౌన్స్‌ చేశారు. ఇప్పుడు చిరంజీవి కూడా వస్తాను అంటే బాక్సాఫీసు దగ్గర సందడి మామూలుగా ఉండదు. చూద్దాం మరి చిరంజీవి ఆలోచన ఎలా ఉందో.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus