Chiranjeevi Dropped Movies: అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!
August 22, 2022 / 08:35 AM IST
|Follow Us
ఎంతటి స్టార్ హీరో అయినా… మిడిల్ డ్రాప్‌లు పక్కా అంటుంటారు మన సినీ పండితులు. అయితే ఇదేదో ఆటలో అనుకునేరు… మేం చెప్పేది సినిమాల్లోనే. ఇప్పటికే మీకు అర్థమైపోయుంటుంది మేం దేని గురించి చెబుతున్నామో. ఆఁ.. అదే మధ్యలో ఆగిపోయిన సినిమాల గురించి. ఈ రోజు… ఆగిపోయిన చిరంజీవి సినిమాల గురించి చూసుకుందామా. చిరు కెరీర్లో 150కిపైగా సినిమాలు ఉన్నాయి. అందులో చాలా సినిమాలు అనేక అవాంతరాలు దాటుకొని రిలీజ్ అయి ఉంటాయి. కొన్ని మాత్రం అడ్డంకులు దాటలేక, ఇంకొన్ని అసలు ప్రారంభమే కాక, మరికొన్నేమో ప్రారంభమైన చోట అగిపోయాయి. అవేంటో ఓసారి చూద్దాం.
* చిరంజీవి ఓకే చేసి ఆగిపోయిన సినిమాల జాబితా పెద్దగానే ఉంటుంది. అలాంటివాటిలో ‘భూలోక వీరుడు’ ఒకటి. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో జానపదంగా ఈ సినిమా తెరకెక్కిద్దాం అనుకున్నారు. కానీ ఏమైందో కానీ… ఆ సినిమా మధ్యలోనే ఆపేశారు.
* ఇక ఇలాంటిదే మరో సినిమా ‘చెప్పాలని ఉంది’. రామ్‌గోపాల్ వర్మతో ఈ సినిమా అనౌన్స్ చేశాడు చిరంజీవి. కొంత భాగం షూటింగ్ కూడా అయ్యింది. భారీ ట్రాఫిక్ జామ్ కాన్సెప్ట్‌లో కొన్ని సీన్స్ తెరకెక్కించారు కూడా. కానీ సినిమా అర్ధాంతరంగా ఆగిపోయింది. కారణాలు ఇప్పటికీ బయటకు రాలేదు.
* ఇప్పుడు పాన్ ఇండియా, పాన్ వరల్ట్ అంటున్నారు కానీ. చిరంజీవి ఎప్పుడో మొదలుపెట్టాడు ఆ తరహా సినిమా. అదే ‘అబు – బాగ్దాద్ గజదొంగ’. సురేశ్ కృష్ణ దర్శకత్వంలో ప్రారంభమైన ఈ హాలీవుడ్ మూవీ… కొన్ని రోజులకు ఆగిపోయింది.
* చిరంజీవి, శ్రీదేవి కాంబినేషన్లో సినిమాలు చాలా వచ్చాయి. అందులో మరో సినిమా కూడా యాడ్ అవ్వాల్సింది కానీ మిస్ అయ్యింది. అదే ‘వజ్రాల దొంగ’. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఆ తర్వాత ఆగిపోయింది.
* శ్రీదేవి సినిమా పక్కపెడితే… అదే కోదండరామిరెడ్డి చిరంజీవితో మరో సినిమా ప్లాన్ చేశారు. ఇద్దరు పెళ్లాల కథతో ఆ సినిమా అనుకున్నారు. సరిగ్గా క్లైమాక్స్ కుదరకపోవడంతో ఆ సినిమా కూడా ఆపేశారు. రేపు పూజా కార్యక్రమం అనగా… ఆ సినిమా ఆగిపోయింది.
* వరుస విజయాలతో దూసుకుపోతున్న ఎస్వీ కృష్ణారెడ్డి కూడా చిరంజీవితో సినిమా అనుకున్నారు. పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. కానీ సినిమా పట్టాలెక్కలేదు.
* ఫీల్ గుడ్ లవ్ స్టోరీలు, కుటుంబ కథలు తీయడం ఆ రోజుల్లో మంచి విజయాలు అందుకున్న దర్శకుడు వి.ఎన్.ఆదిత్య. ఈ క్రమంలో ఆయన చిరంజీవితో ఓ సినిమా అనుకొని, అంతా ఓకే అయ్యింది. కానీ ఆ సినిమా ముందుకెళ్లలేదు.
* రాజకీయాల నుండి తప్పుకున్నాక చిరంజీవి ఇండస్ట్రీ రీఎంట్రీ ‘ఆటో జానీ’తో అన్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఈ సినిమా అంటూ దాదాపు అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. దీని మీద చాలా రోజులు చర్చ జరిగింది. చాలా వెర్షన్లు విన్నారు చిరు. కానీ సినిమా వర్కౌట్ అవ్వలేదు.
* అంతకుముందు కూడా చిరంజీవి – పూరి జగన్నాథ్ కాంబోలో మరో సినిమా కూడా అనుకున్నారు. దీని గురించి సెమీ అనౌన్స్మెంట్ వచ్చింది. అదే ‘ఆంధ్రావాలా’. అప్పట్లో చిరంజీవి ఓకే చేయలేదు. ఆ తర్వాత ఫలితం మీకు తెలిసిందే.