ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా… షూటింగ్ లు మొత్తం నిలిచిపోయాయి. దీంతో రోజూ వారి కూలి పై ఆధార పడే చిన్న సినీ కార్మికులకు పూట గడవని పరిస్ధితి ఏర్పడింది. ఈ నేపధ్యంలో వారిని ఆదుకోవడానికి మెగాస్టార్ చిరంజీవి ‘కరోనా క్రైసిస్ చారిటీ’ ని ఏర్పాటు చేసారు. దీనికి ఇప్పటికే చాలా మంది హీరోలు విరాళాలలను ఇస్తూ వచ్చారు. ఇప్పటికే 8 కోట్ల వరకూ కూడినట్టు సమాచారం.
చిరు తనయుడు రాంచరణ్ కూడా తన వంతు విరాళాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా రాంచరణ్ భార్య మరియు చిరంజీవి కోడలు అయిన ఉపాసన కూడా పేద సినీ కార్మికులకి తన అపోలో సంస్థ ద్వారా ఉచితంగా మందులు పంపడానికి ముందుకు వచ్చింది. ఈ కారణంగా ఆమెను అభినందిస్తూ చిరు తన ట్విట్టర్ ద్వారా స్పందించారు ..
మై డియర్ దిల్ (dil – daughter in law) అని ఉపాసన ను సంభోదించిన మెగాస్టార్ ….’సినిమా కార్మికులకు అండగా నిలబడడం కోసం పెట్టిన CCCకి అన్ని అపోలో స్టోర్స్‌లో ఉచితంగా మందులు పంపిణీ చేసేందుకు ముందుకొచ్చిన నా ప్రియమైన కోడలు ఉపాసనకు ధన్యవాదాలు. నువ్వు చాలా గొప్ప మనసున్న వ్యక్తివి” అంటూ తన కోడలు ఉపాసన పై ప్రశంసలు కురిపించారు మెగాస్టార్.
Most Recommended Video
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
17 ఏళ్లలో అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే!
బుల్లితెర పై రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలు ఇవే!