బిగ్ బాస్ షోలో తమన్నాతో మాట్లాడుతూ శ్రీరెడ్డికి పంచ్
November 4, 2019 / 12:58 PM IST
|Follow Us
తెలుగు సినిమా వజ్రోత్సవ వేడుకల్లో మోహన్ బాబు డైరెక్ట్ గా చిరంజీవి కంటే నాకేం తక్కువ, నాకెందుకు అవార్డ్ ఇవ్వరు అని అడిగినప్పుడు కూడా చిరంజీవి ఒక్క మాట మాట్లాడలేదు, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ మీద అనవసరమైన అభాండాలు వేసినప్పుడు కూడా చిరంజీవి పట్టించుకోలేదు. అందుకే చిరంజీవిని, ఆయన కుటుంబ సభ్యులను ఎప్పటికప్పుడు ఎవరుపడితేవాళ్లు టార్గెట్ చేస్తూనే ఉంటారు. అలా మెగా కుటుంబాన్ని టార్గెట్ చేసినవాళ్ళలో శ్రీరెడ్డి ఒకరు. ఆమె మొదలెట్టిన క్యాస్టింగ్ కౌచ్ అనే యుద్ధం.. అటు తిరిగి ఇటు తిరిగి పవన్ కళ్యాణ్ మీద పడింది. ఆ విషయంలో మెగా ఫ్యామిలీ మొత్తం ఏకమై అసలు ఆ గొడవను పునాది అనేది లేకుండా తీసిపాడేశారు. ఆ తర్వాత శ్రీరెడ్డి కూడా చెన్నై మకాం మార్చేసింది. ఇక అప్పట్నుంచి శ్రీరెడ్డిని తెలుగు మీడియా పట్టించుకోవడం కూడా మానేసింది.
కానీ.. నిన్న రాత్రి జరిగిన బిగ్ బాస్ షోలో చిరంజీవి కంటెస్టెంట్ అయిన తమన్నా సింహాద్రిని ఉద్దేశించి మాట్లాడుతూ.. “కరెక్ట్ వైపు ఉంటావమ్మా నువ్వు, నీ ఫ్రెండ్ తప్పు చేస్తే, ఫ్రెండ్ ని వదిలేసి బయటకొచ్చి ఫ్రెండ్ దే తప్పు అని స్ట్రాంగ్ గా చెప్పావ్. నీకు నాకు మాత్రమే ఈ విషయం అర్ధమవుతుంది” అని చిరంజీవి అన్న మాట శ్రీరెడ్డి గురించి అని అర్ధమవ్వడానికి ఎక్కువ టైమ్ పట్టలేదు. దాంతో చిరంజీవి ఆ విషయంలో ఎంతగా బాధపడ్డారు అనే విషయం అందరికీ తెలిసొచ్చింది.