Chiranjeevi: అలా అభిమానాన్ని చాటుకున్న వెంకటేష్!

  • July 20, 2021 / 10:21 PM IST

వెంకటేష్ నటించిన నారప్ప మూవీ అమెజాన్ ప్రైమ్ లో విడుదలై యావరేజ్ టాక్ ను సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఒరిజినల్ ను తెలుగు ప్రేక్షకులలో చాలామంది చూడటంతో ధనుష్ నటనతో వెంకటేష్ నటనను పోల్చి కొంతమంది నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. అయితే వెంకటేష్ అభిమానులకు మాత్రం నారప్ప నచ్చింది. తెలుగు నేటివిటీకి తగిన విధంగా స్క్రిప్ట్ లో మార్పులు చేసి ఉంటే మంచిదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే చిరంజీవి ఫ్యాన్స్ కు ఈ సినిమాలో సర్ప్రైజ్ ఉండటంతో వాళ్లు సంతోషిస్తున్నారు.

నారప్ప మూవీలో విలన్ థియేటర్ లో చిరంజీవి నటించిన సంఘర్షణ మూవీని చూస్తూ ఈ కుర్రోడు ఏదో ఒకరోజు పెద్దోడు అవుతాడని చిరంజీవిని చూపిస్తూ చెబుతాడు. విలన్ చెప్పిన ఆ డైలాగ్ మెగా ఫ్యాన్స్ కు తెగ నచ్చేసింది. నారప్ప మూవీని సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తుండటం గమనార్హం. వెంకటేష్ చిరంజీవి తన తోటి హీరో కావడం, పాపులారిటీ ఉన్న హీరో కావడంతో ఈ విధంగా అభిమానాన్ని చాటుకున్నారని తెలుస్తోంది.

చిరంజీవి రెఫరెన్స్ సినిమాకు ప్లస్ అయిందని చెప్పవచ్చు. 35 కోట్ల రూపాయలకు అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసింది. అయితే తెలుగులో గత కొన్ని నెలలుగా సినిమాలు రిలీజ్ కాకపోవడంతో ప్రేక్షకులు నారప్పను చూస్తున్నారని సమాచారం. ప్రైమ్ లో ఈ సినిమాకు రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చే అవకాశం ఉంది. వెంకటేష్ నటించిన దృశ్యం2 కూడా ఓటీటీలో రిలీజ్ కానుందని వార్తలు వస్తున్నాయి.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus