తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
October 7, 2022 / 12:49 AM IST
|Follow Us
‘రీమేక్ సినిమాలు అంటే ఎందుకు అంత తక్కువ భావన. రీమేక్ చేయడం అనేది ఆషామాషీ విషయం కాదు. అది ఒక ఛాలెంజ్. ఒక కంపేరిటివ్ స్టడీలో మనం నిలబడగలమా లేదా అనేది ఎప్పుడూ ఒక ఛాలెంజింగ్ గా ఉంటుంది. నేను చేసిన అన్ని రీమేక్ లు ఒరిజినల్స్ కంటే కూడా ఎక్కువగా కలెక్ట్ చేశాయి,మంచి అప్రిసియేషన్ వచ్చింది, నా పాత్రలకు కూడా ప్రశంసలు దక్కాయి. నా కాన్ఫిడెన్స్ ఏంటంటే కంపేర్ చేసినా సరే నేను నిలబడగలను అనడానికి నా హిస్టరీనే చెబుతుంది’ అంటూ ‘గాడ్ ఫాదర్’ ప్రమోషన్స్ లో రీమేక్ ల గురించి చాలా గొప్పగా చెప్పారు చిరు.
చిరు చెప్పింది నిజమే. రీమేక్ చేయడం అనేది ఆషామాషీ వ్యవహారం కాదు. కథ మాత్రమే రెడీగా ఉంటుంది. దాన్ని ఏ భాషలోకి అయితే రీమేక్ చేస్తున్నారో.. అక్కడి జనాల అభిరుచికి తగినట్టు రీమేక్ చేయాలి. మక్కీకి మక్కీ దింపితే.. ‘పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు ఉంటుంది’. మెగాస్టార్ చిరంజీవి కూడా ఏదైనా సినిమాని రీమేక్ చేస్తున్నప్పుడు.. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అందుకే చిరంజీవి నటించిన రీమేక్ సినిమాలలో సక్సెస్ లు సాధించినవే ఎక్కువ. సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు ఎన్ని? అందులో హిట్లు ఎన్ని? ప్లాపులెన్ని? అనే లిస్ట్ ను ఓ లుక్కేద్దాం రండి :
1) చట్టానికి కళ్ళు లేవు : తమిళంలో రూపొందిన ‘సట్టం ఒరు ఇరుత్తరై’ కి రీమేక్ గా రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది.
2) పట్నం వచ్చిన పతివ్రతలు : ‘పట్టణక్కె బంద పత్నియరు’ అనే కన్నడ సినిమాకు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కింది. చిరుతో పాటు మోహన్ బాబు కూడా ఈ మూవీలో హీరోగా నటించాడు. ఈ సినిమా ఆశించినంత సక్సెస్ సాధించలేదు కానీ కాన్సెప్ట్ బాగుంటుంది.
3) విజేత : బెంగాలీ మూవీ సాహెబ్ కు రీమేక్ గా తెరకెక్కింది ఈ మూవీ. అబౌవ్ యావరేజ్ గా నిలబడింది కానీ చిరుకి బెస్ట్ హీరోగా ఫిలిం ఫేర్ అవార్డు దక్కింది.
4) పసివాడి ప్రాణం : మలయాళం మూవీ ‘పూవిను పుతియా పూంతెన్నల్’ కు రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీ మంచి విజయం సాధించింది.
5) ప్రతిబంద్ : చిరు బాలీవుడ్ డెబ్యూ మూవీ ‘ప్రతిబంద్’ తెలుగులో సూపర్ హిట్ అయిన ‘అంకుశం’ కి రీమేక్ అన్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ పెద్ద సక్సెస్ కాలేదు.
6) ఘరానా మొగుడు : ‘అనురాగ అరళితు’ అనే కన్నడ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీ టాలీవుడ్లో మొదటి రూ.10 కోట్లు కలెక్ట్ చేసిన మూవీగా రికార్డు సృష్టించింది.
7) హిట్లర్ : మలయాళంలో హిట్ అయిన ‘హిట్లర్’ సినిమాని చిరు హీరోగా అదే టైటిల్ తో రీమేక్ చేయడం జరిగింది. ఈ మూ వీ టైంలో చిరు వరుస ప్లాపుల్లో ఉండగా.. ‘హిట్లర్’ సూపర్ హిట్ అయ్యి బాస్ కి స్ట్రాంగ్ కం బ్యాక్ అందించింది.
8) స్నేహం కోసం : తమిళంలో వచ్చిన ‘నట్పుక్కాగ’ కి రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీ యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది.
9) ఠాగూర్ : తమిళ్ లో రూపొందిన ‘రమణ’ కి రీమేక్ గా తెరకెక్కింది ఈ చిత్రం. తెలుగులో బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
10) శంకర్ దాదా : ఎం.బి.బి.ఎస్ : హిందీలో హిట్ అయిన ‘మున్నాభాయ్ ఎం.బి.బి.ఎస్’ కి రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీ తెలుగులోనూ సక్సెస్ అందుకుంది.
11) రాజా విక్రమార్క : ‘కమింగ్ టు అమెరికా’ అనే అమెరికన్ మూవీ స్ఫూర్తితో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్లాప్ గా మిగిలింది.
12) ది జెంటిల్ మెన్ :తమిళ, తెలుగు భాషల్లో హిట్ అయిన జెంటిల్ మెన్ ను హిందీలో అదే పేరుతో రీమేక్ చేయగా ఈ మూవీ ప్లాప్ అయ్యింది.
13) శంకర్ దాదా జిందాబాద్ : హిందీలో హిట్ అయిన ‘లగే రహో మున్నాభాయ్’ కి రీమేక్ గా తెరకెక్కింది ఈ మూవీ. కానీ బాక్సాఫీస్ వద్ద ప్లాప్ గా మిగిలింది.
14) ఎస్.పి.పరశురామ్ : తమిళ మూవీ వాల్తేర్ వెట్రివల్ కి రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్లాప్ గా మిగిలింది.
15)ఖైదీ నెంబర్ 150 : తమిళంలో హిట్ అయిన ‘కత్తి’ కి రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీతో చిరు రీ ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యారు.
16) గాడ్ ఫాదర్ : అక్టోబర్ 5న రిలీజ్ అయిన ఈ మూవీ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లూసిఫర్’ కు రీమేక్ గా ఈ మూవీ తెరకెక్కింది.
17) ఆరాధన : తమిళ మూవీ కడలోర్ కవిదైగళ్ కి రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీ సక్సెస్ అందుకోలేకపోయింది. కానీ పాటలు బాగుంటాయి.
18) భోళా శంకర్ : తమిళంలో విజయం సాధించిన ‘వేదాలం’ కి రీమేక్ గా తెరకెక్కుతుంది ఈ మూవీ. మరి ఈ మూవీ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి..!