Chiranjeevi: అలా చేస్తానని సుస్మిత చెబితే మెగాస్టార్ వద్దంటున్నారా?

  • July 18, 2023 / 09:24 PM IST

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో చిరంజీవి కుటుంబ సభ్యులు నిర్మించిన చిరంజీవి సినిమాలలో మెజారిటీ సినిమాలు ఆశించిన ఫలితాలను సొంతం చేసుకోలేదు. అయితే చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత చిరంజీవితో ఒక సినిమా నిర్మించాలని ఆశ పడుతున్నారు. ఈ సినిమాతో చిరంజీవికి కెరీర్ బెస్ట్ హిట్ ఇవ్వాలని ఆమె భావిస్తున్నారు. చిరంజీవి కళ్యాణ్ కృష్ణ కాంబో సినిమాకు నిర్మాతగా సుస్మిత వ్యవహరించనున్నారు.

అయితే చిరంజీవితో (Chiranjeevi) సినిమాలను నిర్మించాలని భావించే నిర్మాతల సంఖ్య తక్కువేం కాదు. తాజాగా ప్రముఖ బ్యానర్ సుస్మిత బ్యానర్ తో పాటు తమ బ్యానర్ కూడా కలిసి కళ్యాణ్ కృష్ణ సినిమాను నిర్మిస్తుందని చెప్పినట్టు సమాచారం. ఖర్చు మొత్తం తమ బ్యానర్ భరిస్తుందని సుస్మితకు లాభాల్లో వాటా ఇస్తామని ఆ బ్యానర్ నిర్మాతలు చిరంజీవికి చెప్పారని బోగట్టా.

ఎలాంటి రిస్క్ లేకుండా మంచి లాభాలను తెచ్చిపెట్టే ఈ ప్రతిపాదనను చిరంజీవి సుస్మిత ముందు ఉంచగా సుస్మిత మాత్రం ఆ ఆఫర్ ను సున్నితంగా రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. చిరంజీవి రెమ్యునరేషన్ ప్రస్తుతం 50 నుంచి 60 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని తెలుస్తోంది. చిరంజీవి రేంజ్ సినిమా సినిమాకు పెరుగుతున్న సంగతి తెలిసిందే. సినిమా సినిమాకు చిరంజీవి క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.

మెగాస్టార్ చిరంజీవి భిన్నమైన కథలను ఎంచుకుంటూ అన్ని జానర్ల కథల ద్వారా వరుస విజయాలను అందుకుంటున్నారు. చిరంజీవి రేంజ్, క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. యంగ్ డైరెక్టర్లు, మాస్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించడానికి చిరంజీవి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇతర హీరోలకు భిన్నంగా మెగాస్టార్ చిరంజీవి కెరీర్ విషయంలో ముందడుగులు వేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవికి రాబోయే రోజుల్లో సైతం వరుస విజయాలు దక్కాలని అభిమానులు కోరుకుంటున్నారు.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus