Chiranjeevi: ‘బేబీ’ సక్సెస్ మీట్లో మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
July 31, 2023 / 04:52 PM IST
|Follow Us
నిన్న జరిగిన ‘బేబీ’ సక్సెస్ మీట్ కి గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఆయన స్పీచ్ లో మారుతి , ఎస్.కె.ఎన్ , దర్శకుడు సాయి రాజేష్ ల పై చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. చిరంజీవి మాట్లాడుతూ.. ‘అభిమానులు థియేటర్లో సినిమా చూసి.. వాళ్ల వాళ్ల లైఫ్‌ను చూసుకునే కంటే.. నేను విజయం సాధించిన ఈ పరిశ్రమకు వచ్చి.. ఇలా విజయం సాధించడం చూస్తే నాకంటే సంతోషించే వాళ్ళు ఉండరు. అభిమానులు అంటే ఫ్యాన్ వార్లు చూస్తుంటాం..
అభిమానుల మీద దురభిప్రాయం వినిపించేది.. అలాంటి సమయంలోనే నా అభిమానులను ఈ సమాజం గర్వపడేలా తీర్చిదిద్దాలని అనుకున్నాను.. అందుకే కొన్ని సామాజిక కార్యక్రమాలు చేపట్టాను.. నా పిలుపు మేరకు అభిమానులు తరలి వచ్చారు.. వారిని చూస్తే నాకు ఎంతో గర్వంగా ఉంటుంది.అలాగే మారుతి, ఎస్ కే ఎన్, సాయి రాజేష్ వంటి వారిని చూస్తుంటే ఆనందంగా ఉంటుంది. నా అభిమానులు ఇంతటి విజయాన్ని సాధించారు.
వారిని అభినందించేందుకు వచ్చాను. మారుతికి నేను ఓ అసైన్మెంట్ ఇచ్చాను. నా పర్సనల్ పని ఇచ్చాను. అద్భుతంగా చేశాడు. దర్శకుడివి అయ్యే టాలెంట్ ఉందని ఆ రోజే చెప్పాను. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌తో సినిమా చేస్తున్నాడు. ఎస్ కే ఎన్ నా బ్యానర్లు కడుతుండేవాడని అన్నాడు. జర్నలిస్ట్‌గా, పీఆర్వోగా పని చేశాడు. అల్లు అరవింద్ గారి ప్రోద్బలం, గీతా ఆర్ట్స్‌లో పని చేయడం, ఈ రోజుల్లో సినిమా చేయడం..
ఇప్పుడు బేబీ.. ఆయన స్పీచులు కూడా అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాను. వీళ్లని చూస్తుంటే నాకు గర్వంగా ఉంది. వీళ్లు నన్ను స్పూర్తిగా తీసుకున్నారు. కానీ ఈరోజు వీళ్లు స్పూర్తిగా నిలబడ్డారు’ అంటూ చెప్పుకొచ్చారు.