Chiranjeevi: ‘ఆచార్య’ ఎఫెక్ట్‌తో చిరంజీవి ఏం చేస్తున్నాడంటే?
July 15, 2022 / 03:24 PM IST
|Follow Us
చిరంజీవి సినిమా అందులోనూ కమర్షియల్ సినిమా అంటే వినోదం పక్కాగా ఉండాలి. ఆయన మరీ డాక్యమెంటరీ సినిమానో, ప్రయోగాత్మక సినిమా చేస్తేనే అందులో వినోదం పక్కాగా ఉండాల్సిందే. ఇది చిరంజీవి సినిమాల్ని ఫాలో అయ్యే ఎవరైనా చెప్పేస్తారు. ఈ ఫార్ములాకు దూరంగా చేసిన కమర్షియల్ సినిమాలు, మాస్ సినిమాలు నిరాశపరిచాయి. దీనికి తాజా ఉదాహరణ ‘ఆచార్య’. ఈ సినిమాలో చిరంజీవి మార్క్ కామెడీ మిస్ అయ్యిందని పరిశీలకులు చెప్పారు. తర్వాతి సినిమాల విషయంలో చిరు జాగ్రత్తలు పడుతున్నాడట.
కర్ణుడి చావుకి వెయ్యి కారణాలు అన్నట్లు.. ‘ఆచార్య’ సినిమా పరాజయానికి చాలా కారణాలు ఉన్నాయి. అయితే అందులో ముఖ్యమైనది అవసరమైన కామెడీ ట్రాక్‌లు లేకపోవడమే. ఇప్పుడు చిరంజీవి తన తర్వాతి సినిమాల్లో మంచి కామెడీ ట్రాక్‌లు సరైనవి పడేలా చూసుకుంటున్నాడట. ఈ మేరకు ‘వాల్తేరు వీరయ్య’ (అఫీషియల్‌గా అనౌన్స్ చేయలేదు), ‘భోళా శంకర్’ సినిమాల్లో కామెడీ బాగా పండేలా చూసుకోమని దర్శకులకు సూచనలు చేశారట. ‘గాడ్ ఫాదర్’ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తవ్వడంతో మార్పులు కుదరలేదు.
ఇక ఈ సినిమాల తర్వాత చిరంజీవి చేయబోయే సినిమా వెంకీ కుడుమలది. ఈ సినిమా ఫుల్ లెంగ్త్ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని టాక్ వినిపిస్తోంది. కాబట్టి అందులో ప్రత్యేకంగా కొత్తగా కామెడీ రాయక్కర్లేదు. సినిమా ఫలితం నుండి పాఠాలు నేర్చుకోవడం చిరంజీవికి బాగా తెలుసు. అందులోనూ చిరంజీవి క్విక్ లెర్నర్ అని కూడా తెలుసు. అందుకే ‘ఆచార్య’ ఫలితం చూసి వెంటనే తన కొత్త సినిమాల విషయంలో మార్పులు సూచించారట.
ఇక ఈ సినిమాల తర్వాత చిరంజీవి లైనప్ విషయంలో క్లారిటీ రాకపోయినా… అందులో త్రివిక్రమ్ సినిమా ఒకటి ఉంటుందని ఆ మధ్య వార్తలొచ్చాయి. అందులో కామెడీ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే మాస్ అంశాలు కూడా ఉంటాయి. వీటితోపాటు రాధిక రాడాన్ పిక్చర్స్‌లో ఓ సినిమా కూడా చేస్తాడు చిరు. ఇవి కాకుండా మరికొన్ని సినిమాలు కూడా ఉన్నాయి. ‘గాడ్ ఫాదర్’ దసరాకు రానుండగా ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతికి వస్తాడట.