మెగాస్టార్ చిరంజీవి గతంలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ‘ప్రజారాజ్యం’ పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. అయితే రాజకీయాల్లో ఆయన ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయారు. తరువాత కొన్ని కీలక పరిస్థితుల్లో ‘ప్రజారాజ్యం’ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు చిరు. మంత్రి కూడా అయ్యారు. కానీ తరువాత కొన్నాళ్ళకు పూర్తిగా రాజకీయాలకు గుడ్ బై చెప్పేసి.. సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికే ‘ఖైదీ నెంబర్ 150’ ‘సైరా నరసింహారెడ్డి’ వంటి చిత్రాలు చిత్రాలు చేసి అభిమానులను అలరించారు.
ఇప్పుడు ‘ఆచార్య’ తో సహా మరో 3 చిత్రాల్లో నటించడానికి రెడీ అయ్యారు. ఇలాంటి తరుణంలో చిరు రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అంటూ వార్తలు వస్తుండడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఈ వార్తల పై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. ఆయన మాట్లాడుతూ… “అన్నయ్య ఎప్పుడైతే రెగ్యులర్ గా సినిమాలు చెయ్యడానికి రెడీ అయ్యారో అప్పుడే రాజకీయాలకు దూరమవ్వాలని డిసైడ్ అయ్యారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు.
జనసేనతో కూడా అన్నయ్యకు సంబంధం లేదు. ‘జనసేన పార్టీ’ ఫౌండర్ పవన్ కళ్యాణ్ కు.. అందులో సభ్యుడినైన నాకు ఆయన అన్నయ్య మాత్రమే. అంతకుమించి మరే సంబంధం లేదు. నిజంగా ఆయనకు రావాలని ఉంటే జనసేనలోకే వస్తారు” అంటూ చెప్పుకొచ్చాడు.ఓ పక్క రాజకీయాలకు రావడం చిరుకి ఇంట్రెస్ట్ లేదు అంటూనే.. మరో పక్క ‘వస్తే జనసేనలోకే వస్తారు’ అని నాగబాబు చెప్పడంతో చిరు పొలిటికల్ రీ ఎంట్రీ పై వార్తలు మొదలయ్యాయి.
Most Recommended Video
కవల పిల్లలు పిల్లలు కన్న సెలెబ్రిటీలు వీరే..!
బాగా ఫేమస్ అయిన ఈ స్టార్స్ బంధువులు కూడా స్టార్సే
బాలయ్య సాధించిన అరుదైన రికార్డ్స్ ఇవే..!