Hitler Movie: ‘హిట్లర్’ ను ఆ హీరో రిజెక్ట్ చేస్తే చిరు వద్దకు వెళ్లిందట..!
August 9, 2021 / 04:13 PM IST
|Follow Us
మెగాస్టార్ చిరంజీవి హీరోగా ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో రూపొందిన సూపర్ హిట్ చిత్రం ‘హిట్లర్’. మలయాళంలో మమ్ముట్టి నటించిన ‘హిట్లర్’ మూవీకి ఇది రీమేక్. 1997 వ సంవత్సరం జనవరి 4 న ఈ చిత్రం విడుదలైంది. సంక్రాంతికి 10 రోజులు ముందు విడుదలైన ‘హిట్లర్’… బాలకృష్ణ ‘పెద్దన్నయ్య'(బ్లాక్ బస్టర్) తో పోటీ పడి మరీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి ముందు చిరు వరుస ప్లాపుల్లో ఉన్నారు. ఆ టైములో ‘చిరు పరిస్థితి ఏంటి?’ అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి.
అయితే ‘హిట్లర్’ చిత్రం సూపర్ హిట్ అయ్యి చిరుకి మళ్ళీ లైఫ్ ఇచ్చిందనే చెప్పాలి. నిజానికి ఈ చిత్రం చిరంజీవి చేయాల్సింది కాదట. ముందుగా ఓ హీరో రిజెక్ట్ చేస్తే అది చిరు వద్దకు వెళ్లిందట. వివరాల్లోకి వెళితే.. మొదట ఈ చిత్రాన్ని మోహన్ బాబుతో చేయాలని నిర్మాత ఎడిటర్ మోహన్ గారు అనుకున్నారు. అందుకు ఇవివి సత్యనారాయణ గారిని దర్శకుడిగా అనుకున్నారు. కానీ అప్పటికి ఇవివి గారు రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.
అందులో మోహన్ బాబుతో చేసే ప్రాజెక్టు కూడా ఉంది. దాంతో వెంటనే మోహన్ బాబుతో సినిమా చేయడం బాగోదు అని ఆయన చెప్పారట. ఈ కథ అంతా నడిపించింది రచయిత మరుధూరి రాజాగారు. అయితే చిరంజీవి గారు హీరోగా ఫైనల్ అయినప్పుడు ఇతన్ని తప్పించి ఎల్.బి.శ్రీరామ్ ను రైటర్ గా పెట్టుకున్నారట. దాంతో కోపం వచ్చి మరుధూరి రాజా ఈ ప్రాజెక్టు నుండీ తప్పుకున్నట్టు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పుకొచ్చారు.