Chiranjeevi: సెన్సార్ వల్ల చిరంజీవికి సంక్రాంతి సూపర్ హిట్ మిస్ అయిన సినిమా ఏదంటే..?
February 25, 2023 / 06:43 PM IST
|Follow Us
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో సూపర్ డూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్స్, హిస్టరీ క్రియేట్ చేసిన మూవీస్, ఇండస్ట్రీ హిట్స్, హిస్టారికల్ హిట్స్ ఉన్నాయి.. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ మూవీతో వరదల్లో సైతం కలెక్షన్ల వరద పారించారు చిరు.. సినిమా ఫ్లాప్ అయినా కానీ దాదాపు నిర్మాత, డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్లు నష్టపోయేవారు కాదు.. మిగతా వాళ్లకి హీరోయిన్, కాంబినేషన్, కమెడియన్స్, మ్యూజిక్ డైరెక్టర్ లాంటివి కావాలి కానీ బాక్సాఫీస్ బరిలో కోట్లాది రూపాయల వసూళ్లు కురిపించాలంటే పోస్టర్ మీద చిరు బొమ్మ ఒక్కటి చాలు..
రాజకీయాల కారణంగా కొంతకాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా కానీ రీ ఎంట్రీ తర్వాత దుమ్ముదులుపుతున్నారు.. గతేడాది ‘ఆచార్య’, ‘గాడ్ ఫాదర్’ రిలీజ్ చేశారు.. ఈమధ్య కాలంలో ఒకే ఏడాది రెండు సినిమాలు వదిలింది చిరు మాత్రమే.. ఇప్పుడు కూడా వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ లైన్లో పెడుతూ పరిశ్రమ వర్గాల వారికి.. యంగ్ హీరోలకి కూడా గట్టి పోటీనిస్తున్నారు.. అలాగే సంక్రాంతి సీజన్లో కూడా పలు హిట్స్ కొట్టారు చిరు.. అయితే కేవలం సెన్సార్ కారణంగా ఓ సూపర్ హిట్ కోల్పోయారు మెగాస్టార్.. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
మెగాస్టార్ చిరంజీవి, రోజా, మీనాలతో ఎ. కోదండ రామి రెడ్డి దర్శకత్వంలో.. కామాక్షి దేవి కమల్ కంబైన్స్ బ్యానర్ మీద కె.సి. శేఖర్ బాబు, డి. శివ ప్రసాద్ రెడ్డి నిర్మించిన పక్కా మాస్ ఎంటర్టైనర్.. ‘ముఠామేస్త్రి’.. కూలీ నుండి రాజకీయ నాయకుడిగా ఎదిగి.. దుర్మార్గుల ఆట కట్టించడం కోసం మళ్ళీ కూలీగా మారే బోసు పాత్రలో చిరంజీవి నటన సింప్లీ సూపర్బ్.. ఇక ఆయన కామెడీ టైమింగ్, ఫైట్లు, డ్యాన్సులు చూడటానికి మాస్ ప్రేక్షకులు పెద్ద ఎత్తున థియేటర్ల బాట పట్టడంతో..
అత్యధిక కలెక్షన్లతో ఘన విజయం సాధించింది.. చిరంజీవి కెరీర్లో మాస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న సినిమాల్లో ‘ముఠామేస్త్రి’ ముందు వరుసలో ఉంటుంది.. అయితే 1993 సంక్రాంతికి రావాల్సిన ఈ మూవీ సెన్సార్ పనులు ఆలస్యమవడంతో జనవరి 17న విడుదలైంది.. లేట్ అయినా లేటెస్ట్ గా అన్నట్టు సూపర్ హిట్ అయింది కానీ కొంచెంలో సంక్రాంతి హిట్ మిస్ అయిపోయింది..