రుద్రవీణ మూవీ ఆ సినిమాకు కాపీ అట..!

  • April 12, 2020 / 10:02 PM IST

చిత్ర పరిశ్రమలో కాపీ అనేది చాలా కామన్ పాయింట్. ఓ సినిమా నేపద్యాన్నో, కథనో పోలిన కథతో మరో సినిమా వస్తే దానినే కాపీ అంటారు. దానిని అధికారికంగా హక్కులు కొనుక్కొని చేస్తే రీమేక్ అంటారు. ఐతే దర్శకులు ఈ కాపీ అనే దొంగ వ్యవహారాన్ని, స్ఫూర్తి అనే పేరుతో దొరతనంగా, గౌరమైన వ్యవహారంగా మార్చేశారు. చీమ చిటుక్కుమంటే పసిగట్టే సోషల్ మీడియా యుగంలో కూడా ఇతర బాషా చిత్రాల నుండి, పాత చిత్రాల నుండి కథలు కాఫీ కొట్టే దర్శకులు ఉన్నారు, అదే వారి భాషలో చెప్పాలంటే స్ఫూర్తిగా తీసుకొని తెరక్కిస్తున్నారు. తీరా విషయం బయటపడ్డాక ఎదో ఒక స్టోరీ చెప్పి కవరింగ్ ఇస్తున్నారు. స్టార్ డైరెక్టర్ లు, హీరోలు ఈ పద్ధతి ఫాలో అవడం విశేషం.

చిరంజీవి హీరోగా 1988లో వచ్చిన రుద్రవీణ చిరంజీవి సినిమాలలో క్లాసిక్ గా మిగిలిపోయింది. దర్శక దిగ్గజం కె బాలచందర్ ఈ సినిమాను చిరంజీవి ఇమేజ్ కి భిన్నంగా సోషల్ కాన్సెప్ట్ తో తెరకెక్కించారు. చిరంజీవి తమ్ముడు నాగబాబు అంజనా ప్రొడక్షన్స్ స్థాపించి మొదటి చిత్రంగా రుద్రవీణ నిర్మించారు. సనాతన బ్రహ్మాణ కుటుంబంలో పుట్టిన యువకుడు తండ్రిని ఎదిరించి, సామాన్యుల కోసం, సమాజంకోసం పాటు పడే యువకుడి కథగా ఈ సినిమా వచ్చింది. అప్పటికే కమర్షియల్ సినిమాలతో మాస్ హీరోగా ఎదిగిన చిరంజీవి ఇమేజ్ కి ఈ మూవీ అసలు సెట్ కాలేదు. విమర్శకుల ప్రశంసలతో పాటు, అవార్డులు రివార్డులు గెలుచున్న ఈ చిత్రం కమర్షియల్ గా ఫెయిల్ అయ్యింది.

ఐతే ఈ మూవీ ఓ సినిమాకు కాపీ అనే వివాదం అప్పుడు చెలరేగింది. రుద్రవీణ సినిమా విడుదలకు నాలుగేళ్ళ క్రితం మాదాల రంగారావు హీరోగా జనం మనం మూవీ విడుదల కావడం జరిగింది.కొన్ని సున్నితమైన సామాజిక అంశాలను ఘాటైన విమర్శతో తెరకెక్కించడంతో ఆ మూవీపై కొన్నాళ్లు నిషేదం నడిచింది. ఆ మూవీ కథ దాదాపు రుద్రవీణ సినిమాను పోలివుంటుంది అట. ఐతే చిరంజీవితో మాదాల రంగారావుకు ఉన్న సాన్నిత్యం నేపథ్యంలో మాదాల రంగారావు ఈ మూవీపై కోర్టుని ఆశ్రయించలేదని తెలిసింది. కాబట్టి చిరంజీవి కెరీర్ లో క్లాసిక్ గా నిలిచిన రుద్రవీణకు కూడా కాపీ మరకలు ఉన్నాయి.

Most Recommended Video


టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
17 ఏళ్లలో అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే!
బుల్లితెర పై రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలు ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus