డబుల్ మీనింగ్ డైలాగులు చెప్పడంలో చిరంజీవి స్టైలే వేరు!
May 27, 2017 / 11:45 AM IST
|Follow Us
సినిమాలోనే కాదు. సినీ వేడుకల్లోను డబల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్కువయ్యాయి. కొంతకాలం క్రితం సావిత్రి మూవీ ఆడియో ఫంక్షన్లో ‘అమ్మాయిల చుట్టూ ఊరికే తిరిగితే ఫ్యాన్స్ ఊరుకుంటారా. ముద్దయినా పెట్టేయాలి.. కడుపైనా చేసేయాలి. నేను ఎక్కని ఎత్తుల్లేవు, చూడని లోతుల్లేవు’ అని బాలకృష్ణ డబల్ మీనింగ్ డైలాగ్ చెప్పి విమర్శలను ఎదుర్కొన్నారు. రీసెంట్ గా రారండోయ్ వేడుక చూద్దాం ప్రీ రిలీజ్ వేడుకలో చలపతి రావు మరీ సింగిల్ మీనింగ్ తో ‘ అమ్మాయిలు పక్కలోకి పనికొస్తారు’ అనడం వివాదాస్పదం అయింది. మహిళలపై ఇలాంటి కామెంట్స్ చేయడం సినీ కార్యక్రమాల్లోనే కాదు.
బుల్లితెర షోలోను కోకొల్లలు. జబర్దస్త్, పటాస్ షోలలో బూతులు కుప్పలు తెప్పలుగా కనిపిస్తుంది. తాజాగా మీలో ఎవరు కోటీశ్వరుడు షోలోను చిరంజీవి తనదైన స్టైల్లో డబల్ మీనింగ్ గా మాట్లాడారు. అఖిల్ గెస్ట్ గా వచ్చినపుడు.. ‘నీకు ఫ్రూట్స్ గురించి తెలియాలంటే నువ్వు కె. రాఘవేంద్రరావుతో ఒక్క సినిమాలో అయినా చేయాల్సిందే. అన్ని రకాల పళ్లను హీరోయిన్ బొడ్డుపై వేశారాయన’ ని మెగాస్టార్ చిరంజీవి చెప్పడాన్ని అందరూ విమర్శిస్తున్నారు. కుటుంబం మొత్తం కలిసి కూర్చొని చూసే ఇలాంటి షోలలో కూడా డబల్ మీనింగ్ డైలాగ్స్ చొప్పించడం బాధాకరమని మహిళలు అంటున్నారు. ఆ స్థానంలో మెగాస్టార్ కాకుండా ఇంకెవరైనా ఉంటే పెద్ద గొడవ అయ్యేదని పలువురు చెబుతున్నారు. వెండితెర అయినా, బుల్లి తెర అయినా బూతులు లేకుండా ఉంటే అందరికీ మంచిది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.