రామోజీ ఫిలిం సిటీలో చిరంజీవి 150 వ సినిమా

  • June 7, 2016 / 02:07 PM IST

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150 వ సినిమా కత్తిలాంటోడుకి అన్ని అడ్డంకులు తొలిగి పోయాయి. వీ వీ వినాయక్ దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మిస్తున్నఈ సినిమాకు ప్రీ పొడక్షన్ వర్క్ రెండు నెలల క్రితమే పూర్తి అయ్యింది. అయినా షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు షూటింగ్ తేదీని చిత్ర బృందం మంగళవారం వెల్లడించింది. ఈ నెల 20 నుంచి రామోజీ ఫిలిం సిటీలో వేసిన సెట్స్ లో చిత్రీకరణ మొదలవుతుందని ప్రకటించింది. మైండ్ గేమ్ తో సాగే ఈ సినిమాకి ఫైట్స్ కీలకం. అందుకే వినాయక్ యాక్షన్ సన్నివేశాల మీద దృష్టి పెట్టాడు.

కత్తి లాంటి హీరోతో సరసాలాడే సుందరి ఎవరో ఇంకా ఖరారు కాలేదు. తొలుత అనుష్క అనుకున్నారు. తర్వాత నయనతారను సంప్రదించారు. ఇద్దరూ బిజీగా ఉండడంతో బాలీవుడ్ సుందరి దీపిక పదుకునే కి ఈ ఆఫర్ వెళ్ళింది. మెయిన్ హీరోయిన్ ఎవరో ఫైనల్ కాకముందే ఈ సినిమాలో ప్రత్యేక పాటలో చిరంజీవి పక్కన స్టెప్పులు వేసే భామను సెలెక్ట్ చేసారు. ఇద్దరు అమ్మాయిలతో, సరైనోడు సినిమాలలో స్టైలిష్ స్టార్ బన్నీతో కాలు కదిపిన అందాల నటి కేథరిన్ చిరుతో స్పెషల్ సాంగ్ కు ఓకే చెప్పింది. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సాంగ్ కంపోజింగ్ లో నిమగ్నమై ఉన్నాడు. మాస్ ని ఉర్రూతలూగించే పాటలు ఇవ్వాలని తపిస్తున్నాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus