ఖైదీ కంటే ముందుగానే తెరపైకి రానున్న మెగాస్టార్ సినిమా
November 12, 2016 / 12:11 PM IST
|Follow Us
దాదాపు తొమ్మిదేళ్ల పాటు మేకప్ వేసుకోకుండా కెమెరాకి దూరంగా ఉన్న చిరంజీవి ప్రస్తుతం ‘ఖైదీ’గా తుది మెరుగులు దిద్దుకుంటున్నారు. ఇన్నేళ్ల అభిమానుల కలను మరి కొద్ది రోజుల్లో నిజం చేయనున్న మెగాస్టార్ దానికంటే ముందే మరో సినిమాతో థియేటర్లలోకి రానునుండటం విశేషం. అయితే ఇదేదో కొత్త సినిమా అనుకునేరు.. పాత సినిమాకే కొత్త రంగులు పూసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.చిరంజీవి హీరోగా రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన ‘ఘరానా మొగుడు’ 1992 ఏప్రిల్ 9న విడుదలై ప్రేక్షకులకు వినోదం పంచి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నమోదైంది. కె దేవి వరప్రసాద్ నిర్మించిన ఈ సినిమా డిజిటల్ వెర్షన్ త్వరలో విడుదల కానుంది. గతంలో ‘మాయాబజార్’ వంటి కొన్ని చిత్రాలు ఈ కోవలో డిజిటల్ వెర్షన్ లో విడుదల కాగా ఇప్పుడు ఆ జాబితాలో చిరు ‘ఘరానా మొగుడు’ చేరనుంది.
ఇక ఈ సినిమా విషయానికొస్తే… ‘అనురాగద అంతఃపుర’ అనే కన్నడ నవల ద్వారా ఈ సినిమాకి బీజం పడిందని చెప్పొచ్చు. ఈ నవల ఆధారంగా1986లో అలనాటి సూపర్ స్టార్ రాజ్ కుమార్ ‘అనురాగ ఆరళితు’ సినిమా చేశారు. దీన్ని మూలంగా అక్కడికి ఆరేళ్ళ తర్వాత తమిళ దర్శకుడు పి.వాసు రజనీకాంత్, విజయశాంతి, కుష్బూ హీరో హీరోయిన్లుగా ‘మన్నన్’ తెరకెక్కించగా అక్కడి నుండి దర్శకేంద్రుడి ఇచ్చిన కొత్త రూపంతో ‘ఘరానా మొగుడు’గా తెలుగు తెరమీదికొచ్చింది. చిరంజీవి, నగ్మా, వాణి విశ్వనాధ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం దక్షిణాదిన పది కోట్లు వసూలు చేసిన తొలి చిత్రంగా రికార్డులకెక్కింది. నవరస నటనా సార్వభౌమ బిరుదాంకిత కైకాల సత్య నారాయణ విలన్ పాత్రలో నటించగా అప్పటికే విలన్ అప్పటివరకు చిరంజీవి హీరోగా నటించిన సినిమాల్లో ప్రతినాయకుడిగా మెప్పించిన రావు గోపాలరావు ‘అల్లుడు శిష్యా..’ అంటూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచారు. ఇలా ఎన్నో ప్రత్యేకలున్న ఈ సినిమా 1994లో అనిల్ కపూర్-శ్రీదేవి హీరోయిన్లుగా లాడ్ల పేరుతో బాలీవుడ్ కి వెళ్లి అక్కడా విజయం సాధించింది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.