Chor Baazar Review: చోర్ బజార్ సినిమా రివ్యూ & రేటింగ్!
July 1, 2022 / 01:28 PM IST
|Follow Us
పూరి జగన్నాధ్ తనయుడు ఆకాష్ పూరి కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం “చోర్ బజార్”. 2015 నుంచి హీరో అవ్వడం కోసం ప్రయత్నిస్తున్న ఆకాష్ తాజా ప్రయత్నంతోనైనా తన కల నేరవేర్చుకున్నాడో లేదో చూద్దాం..!!
కథ: జీవితం మీద పెద్ద ఆశలేమీ లేకుండా.. చిన్న చిన్న దొంగతాలు చేసుకుంటూ.. 30 నిమిషాల్లో అత్యధిక కార్ టైర్లు మార్చిన వ్యక్తిగా గిన్నీస్ రికార్డ్ సాధించాలని ప్రయత్నిస్తుంటాడు బచ్చన్ సాబ్ (ఆకాష్ పూరి). ఓ మూగమ్మాయిని (గెహనా సిప్పి) ప్రేమిస్తూ టైమ్ పాస్ చేస్తుంటాడు. అదే సమయంలో 200 కోట్ల విలువ గల నిజాం డైమెండ్ మిస్ అయ్యి.. చోర్ బజార్ లో ఉందని పోలీసులకు తెలుస్తుంది. ఈ రచ్చలోకి అనుకోకుండా ఇరుక్కుంటాడు బచ్చన్ సాబ్. అసలు నిజాం డైమెండ్ కి, బచ్చన్ సాబ్ కి ఉన్న సంబంధం ఏమిటి? డైమెండ్ ఏమైంది? వంటి ప్రశ్నలకు సమాధానమే “చోర్ బజార్” చిత్రం.
నటీనటుల పనితీరు: పూరి ఆకాష్ తో మొదటి నుంచి ఇష్యూ ఏంటంటే.. అతడు ప్లే చేసే క్యారెక్టర్స్ అతడి బాడీ లాంగ్వేజ్ తో మ్యాచ్ అవ్వవు. తన వయసుకు మించిన పాత్రలు చేస్తుంటాడు ఆకాష్. చోర్ బజార్ కూడా అలానే ఉంటుంది. ఇప్పటికైనా ఆకాష్ ఆ విషయాన్ని గుర్తించి మాస్ హీరోగా స్టార్ డమ్ సొంతం చేసుకోవడానికంటే ముందుగా.. నటుడిగా, కథానాయకుడిగా గుర్తింపు పొందడం చాలా ముఖ్యం. ఈ విషయాన్ని ఆకాష్ ఎంత త్వరగా గమనిస్తే అంత మంచిది. గెహనా సిప్పి క్యూట్ గా యాక్టింగ్ తో ఆకట్టుకుంది. సుబ్బరాజు పోలీస్ పాత్రలో అలరించాడు. చాన్నాళ్ల తర్వాత “నిరీక్షణ” ఫేమ్ అర్చనను తెరపై చూడడం మంచి ఫీల్ ఇచ్చింది.
సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు జీవన్ రెడ్డి పనితనం సినిమా సినిమాకి అడుగంటుతుంది అనిపిస్తుంది. “దళం” సినిమాని గనుక బేరీజు వేసుకుంటే.. దర్శకుడిగా జీవన్ రెడ్డి స్థాయి తగ్గిందనే చెప్పాలి. కథ-కథనం కంటే జీవన్ రెడ్డి సినిమాల మేకింగ్ చాలా భిన్నంగా, వైవిధ్యంగా ఉంటుంది. ఆ స్టైల్ “చోర్ బజార్”లో కనిపించలేదు. కథకుడిగా, దర్శకుడిగా జీవన్ రెడ్డి ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి.
సురేష్ బొబ్బిలి సంగీతం బాగుంది. నేపధ్య సంగీతం మాత్రం ఎందుకో సింక్ అవ్వలేదు. సినిమాటోగ్రఫీ వర్క్ మాత్రం చాలా యావరేజ్ గా ఉంది. జనరల్ గా జగదీష్ వర్క్ సబ్జెక్ట్ కి చాలా యాప్ట్ ఉంటుంది. కానీ.. ఈ సినిమాకి అతనికి సరైన ప్రొడక్షన్ సపోర్ట్ అందలేదో.. లేక మరీ ఎక్కువరోజులు వర్క్ చేయడం వల్లనో చాలా సన్నివేశాల్లో కంటిన్యూటీ మిస్ అయ్యింది.
విశ్లేషణ: ఆకాష్ పూరి మాస్ హీరోగా కంటే ముందు నటుడిగా, కథానాయకుడిగా నిలదొక్కుకోవడం చాలా ముఖ్యమని ప్రూవ్ చేసే సినిమా “చోర్ బజార్”.