చిక్కుల్లో ప్రముఖ కొరియోగ్రాఫర్.. ఆ మహిళపై లైంగిక దాడి..!
April 1, 2022 / 02:28 PM IST
|Follow Us
2021 ఎండింగ్లో వచ్చిన ‘ఊ అంటావా మావ.. ఉఊ అంటావా’ అనే పాట ఇండియా మొత్తాన్ని ఓ ఊపు ఊపేసిందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సమంత బోల్డ్ స్టెప్పులు ఈ పాటకే హైలెట్ గా నిలిచాయి. కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య మాస్టర్ కు కూడా ఈ పాట వల్ల మంచి పేరొచ్చింది. ‘పుష్ప’ సినిమా నార్త్ లో హిట్ అవ్వడానికి ఈ పాట కూడా కీలక పాత్ర పోషించింది. అయితే ఈ పాటకి కొరియోగ్రఫీ అందించిన గణేష్ మాస్టర్ ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు.
లైంగిక వేధింపుల కేసులో గణేష్ మాస్టర్ పై ఇటీవల చార్జ్‌షీట్ దాఖలైంది. ఆయనతో పాటు తోటి అసిస్టెంట్ల పై కూడా 354-ఎ, 354-సి, 354-డి,509,323, 504 సెక్షన్ల క్రింద అభియోగాలు నమోదు నమోదయ్యాయి. ఓ మహిళా కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్ పై కేసు పెట్టింది.ఆమెను లైంగికంగా, మానసికంగా కూడా వేధించాడు అంటూ ఆమె కేసు ఫైల్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. “గణేష్ మాస్టర్ నన్ను లైంగికంగా, మానసికంగా చాలా వేధించాడు.
2010 వ సంవత్సరం మే లో అతనితో శృంగారంలో పాల్గొనాలని బలవంతం చేశాడు. ఆయన చెప్పినట్లు చేస్తే ఇండస్ట్రీలో అవకాశాలు ఇప్పిస్తానని మభ్యపెట్టి లొంగదీసుకోవాలని ప్రయత్నించాడు. కానీ నేను అందుకు అంగీకరించకపోవడంతో 6 నెలల్లోనే ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్‌లో నా సభ్యత్వం రద్దు చేయించాడు.అంతేకాదు గణేష్ మాస్టర్ తో పాటు అతని అసిస్టెంట్స్‌తో కూడా నా పై దాడి చేయించాడు.
కొంతమంది మహిళా అసిస్టెంట్లు నన్ను కొట్టి అసభ్యకరమైన పదాలతో నన్ను దూషించారు. నా పరువు తీశారు. ఆ తర్వాత నేను నాన్ కాగ్నిసబుల్ కేసు నమోదు చేయడం జరిగింది. అటు తర్వాత తదుపరి చర్యల కోసం లాయర్ని సంప్రదించడం కూడా జరిగింది’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది.తనకి ఎలాగైనా న్యాయం చేయాలంటూ ఆమె విన్నపించుకుంటుంది.అయితే వీటిలో ఎంత వరకు నిజముందో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది.