CM Jagan: ఏపీలో టికెట్ రేట్లు అలా ఉండబోతున్నాయా?

  • March 7, 2022 / 07:14 PM IST

దాదాపుగా 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ప్రభాస్ రాధేశ్యామ్ రిలీజ్ కావడానికి మరో మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ సమయానికే ఏపీలో అడ్వాన్స్ బుకింగ్ మొదలవ్వాల్సి ఉన్నా కొత్త జీవో అమలులోకి రాకపోవడం సమస్యగా మారింది. అయితే ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ రాధేశ్యామ్ కు శుభవార్త చెప్పడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా టికెట్ రేట్ల జీవోపై సంతకం పెట్టారని తెలుస్తోంది.

ఏపీ హైకోర్టుకు సమాచారం ఇచ్చి కొత్త జీవోను అమలులోకి తీసుకొస్తారని బోగట్టా. మంగళవారం సాయంత్రం సమయానికి కొత్త జీవో అమలులోకి వచ్చే ఛాన్స్ ఉందని బోగట్టా. జగన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల విడుదల కాబోయే సినిమాలకు భారీస్థాయిలో ప్రయోజనం చేకూరనుంది. అయితే ఏపీ ప్రభుత్వం పాన్ ఇండియా సినిమాలకు ఒకలా మిగతా సినిమాలకు మరోలా టికెట్ రేట్లను నిర్ణయించినట్టు తెలుస్తోంది. గతంతో పోలిస్తే భారీగానే టికెట్ రేట్లు పెరగనున్నాయని సమాచారం అందుతోంది.

ఏ సెంటర్స్ లోని థియేటర్లలో 200 రూపాయల వరకు టికెట్ రేటు ఉండవచ్చని తెలుస్తోంది. మల్టీప్లెక్స్ లలో టికెట్ రేట్లకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది. సీ, డీ సెంటర్లలో కూడా బాగానే టికెట్ రేట్లు పెరిగాయని బోగట్టా. టికెట్ రేట్లు పెరిగితే రాధేశ్యామ్ కళ్లు చెదిరే కలెక్షన్లను సాధించే ఛాన్స్ ఉంది. టికెట్ రేట్లను తగ్గించడం వల్ల వకీల్ సాబ్, అఖండ, పుష్ప, భీమ్లా నాయక్ సినిమాలు భారీగా నష్టపోయాయి.

టికెట్ రేట్ల తగ్గింపు వల్ల నష్టపోయిన సినిమాలలో పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలు రెండు ఉండటం గమనార్హం. సాధారణ సినిమాలకు ఏ సెంటర్లలో గరిష్టంగా 150 రూపాయలు టికెట్ రేటుగా ఉండే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది. మరికొన్ని గంటల్లో కొత్త టికెట్ రేట్ల జీవో అమలులోకి రానుంది. రాధేశ్యామ్ సినిమాకు బెనిఫిట్ షోలకు కూడా అనుమతి లభిస్తుందేమో చూడాలి.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus