Vanisri: సీఎం సాయంతో రూ.20 కోట్ల విలువగల స్థలాన్ని దక్కించుకున్న వాణిశ్రీ
September 30, 2022 / 02:48 PM IST
|Follow Us
వాణిశ్రీ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ఒకప్పుడు ఈమె కూడా స్టార్ హీరోయిన్ గా రాణించినవారే..! భారీ రెమ్యునరేషన్ అందుకున్న హీరోయిన్ గా కూడా ఎన్నో రికార్డులు సృష్టించారు. ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరులో పుట్టి పెరిగిన ఈమె.. అటు తర్వాత సినిమాల రీత్యా చెన్నైలో సెటిల్ అయ్యింది. చాలా కాలం తర్వాత ఈమె వార్తల్లోకెక్కడం విశేషం. ఈమె స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న రోజుల్లో అక్కడ చాలా భూములను కొనుగోలు చేశారు.
అయితే ఆమెకు సంబంధించిన ఒక స్థలం 11 సంవత్సరాల క్రితం కబ్జాకు గురైంది. ఆ స్థలం కోసం వాణిశ్రీ సుదీర్ఘ కాలంగా పోరాటం చేస్తూనే ఉన్నారు. మొత్తానికి ఆమె పోరాటానికి ఫలితం దక్కింది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సాయంతో కబ్జా రాయుళ్ల నుండి వాణిశ్రీ తన స్థలాన్ని దక్కించుకోగలిగారు. 11 ఏళ్ల నిరీక్షణ, పోరాటానికి ఫలితం దక్కినట్టు అయ్యింది. ఈ విషయంలో ముఖ్యమంత్రి స్టాలిన్ చేసిన సాయానికి గాను ఇండస్ట్రీ వర్గాలు సంతోషిస్తూ ఆయన్ని ప్రశంసిస్తున్నారు.
భూములకి బాగా రేట్లు పెరగడంతో, ఖాళీ స్థలాలు కనిపిస్తే కొంతమంది కబ్జాలు చేసేస్తున్నారు. రాజకీయ నాయకుల పలుకుబడితో ఇదంతా చేసేవారు ఉన్నారు. ఈ క్రమంలో 20 కోట్ల రూపాయల విలువ గల వాణిశ్రీ స్థలం 11 ఏళ్ల క్రితం కబ్జా అవ్వడం.. ఇప్పుడు ఆమె తిరిగి దక్కించుకోవడం గొప్ప విషయమే.! ఇందుకోసం ఆమె ఎంత కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చిందో.
ఇక ఈ విషయం పై వాణిశ్రీ స్పందిస్తూ.. ‘ముఖ్యమంత్రి స్టాలిన్ కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.11 ఏళ్ల క్రితం కబ్జా అయిన నా భూమిని తిరిగి ఆయన నాకు ఇప్పించారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి’ అంటూ వాణిశ్రీ చెప్పుకొచ్చారు.