కలెక్షన్స్ దెబ్బతీయడం కాదు.. ఎన్టీయార్ ఇమేజ్ ను డ్యామేజ్ చేయడం కోసం
February 25, 2019 / 06:30 PM IST
|Follow Us
సినిమాలు ఫ్లాప్ అవ్వడం, జనాలకి నచ్చకపోవడం అనేది చాలా సాధారణంగా జరిగే విషయం. ఒక్కోసారి ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయిపోతుంటాయి. ఇంకోసారి భారీ అంచనాల నడుమ విడుదలైన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లాపడుతుంటాయి. ఒక సినిమా ఎలాంటి సందర్భంలో విడుదలైతే సూపర్ హిట్ అవుతుంది, ఎలాంటివి సినిమాకి ప్లస్ అవుతాయి అనేది ఎవ్వరూ ఊహించలేని విషయం. అయితే.. ఈమధ్యకాలంలో కొన్ని సినిమాల మీద కావాలని నెగిటివ్ ప్రోపగాండా చేస్తున్నారు కొందరు. పరిస్థితి ఎంత దారుణంగా తయారయ్యిందంటే.. అసలు సినిమా చూడకండి అని స్పెషల్ గా చెబుతున్నారు.
ఇందులో రాజకీయ కోణం ఉందా, కులం లేదా వర్గ పరమైన ఇబ్బందులు ఉన్నాయా అనేది పక్కనపెడితే.. ఒక సినిమా అనేది కొన్ని వేల జీవితాలను ఆడుకొనే అంశం. అలాంటి సినిమా మీద పర్సనల్ ఒపీనియన్ చెప్పడం వరకు ఒకే కానీ.. పొరపాటున కూడా సినిమా చూడకండి, ఈ సినిమా చూడాల్సినవసరం లేదు, ఒక నెల ఆగితే ఆన్లైన్ లో వస్తుంది అప్పుడు చూసుకోవడం బెటర్ అని కామెంట్స్ చేస్తూ సినిమాకి నష్టం కలిగిస్తుంది. డిజాస్టర్ అయిన “వినయ విధేయ రామ” చిత్రానికి కూడా “ఎన్టీఆర్ మహానాయకుడు” సినిమాకి వస్తున్న రేంజ్ లో నెగిటివ్ న్యూస్ రాలేదు. మరి ఈ నెగిటివ్ ప్రచారం వెనుక ఉన్న దుష్ట శక్తులు ఏవో తెలియదు కానీ.. అలాంటివాటిని త్వరగా అంతం చేయకుంటే ఇండస్ట్రీకే పీడలా తయారవుతారు.