అప్పుడెప్పుడో 2005లో “డేంజర్” చిత్రంతో నటిగా ఎంట్రీ ఇచ్చిన కలర్స్ స్వాతి అనంతరం పలు సినిమాల్లో ప్రధాన పాత్రలు, సహాయ పాత్రలు పోషించి, కొన్నిట్లో మెప్పించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకుంది. స్వయానా క్రియేటివ్ జీనియస్ తన సినిమాలో కలర్స్ స్వాతిని పరిచయం చేయడంతో తెలుగు, తమిళ, మలయాళ భాషా చిత్రాల్లో ఆమెకు విశేషమైన డిమాండ్ పెరిగింది. అందరి తెలుగమ్మాయిల్లానే స్వాతికి కూడా తెలుగులో కంటే పక్క రాష్ట్రాల్లోనే ఎక్కువ అవకాశాలొచ్చాయి. మళ్ళీ 2013లో వచ్చిన “స్వామి రారా”తో సెకండ్ ఇన్నింగ్స్ కి బ్రేక్ వచ్చింది.
ఆ తర్వాత మళ్ళీ వరుస పరాజయాలతో తన ప్రభావాన్ని కోల్పోతుంది అనగా.. 2014లో వచ్చిన “కార్తికేయ”తో మళ్ళీ ఆమె కెరీర్ కాస్త ఊపందుకుంది. 2017లో వచ్చిన “లండన్ బాబులు” తెలుగులో కలర్స్ స్వాతి చివరిసారి కనిపించిన సినిమా. ఆ తర్వాత కలర్స్ స్వాతి పెళ్లి చేసుకొని ఇండోనేసియాలో సెటిల్ అయిపోయి.. టీవీ9 ఇంటర్వ్యూలో స్విమ్మింగ్ చేస్తూ కనిపించి అందరినీ స్టన్ చేసింది. దాంతో ఆ సమయంలో అమ్మడికి ఆఫర్లు వచ్చినా పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు చాన్నాళ్ల తర్వాత హైదరాబాద్ వచ్చిన స్వాతి తన నట తృష్ణను తీర్చుకొనే ప్రయత్నాలు మొదలెట్టింది.
భారీ స్థాయి దర్శకనిర్మాతలు స్వాతిని క్యాస్ట్ చేసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో.. ఆమె ప్రస్తుతం వెబ్ సిరీస్ వైపు దృష్టి మళ్లిస్తోంది. ఆల్రెడీ కొన్ని ఆఫర్లు వచ్చాయని, డిసెంబర్ లో ఎదో ఒక సిరీస్ ను ఫైనల్ చేసి.. జనవరి నుంచి షూటింగ్ లో పాల్గొనడానికి రంగం సిద్ధం చేసుకొంటోందని సమాచారం. సో, కలర్స్ స్వాతి రీరీరీ ఎంట్రీ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్లే.
Most Recommended Video
బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?