Ali: ‘ఎఫ్3’ సక్సెస్ మీట్లో సంచలన కామెంట్స్ చేసిన అలీ..!
May 31, 2022 / 06:48 PM IST
|Follow Us
చాలా కాలం తర్వాత అలీకి ‘ఎఫ్3’ మూవీలో మంచి పాత్ర దొరికింది. ఈ చిత్రంలో అతను పాల బేబీ అనే పాత్రని పోషించాడు. ఈ చిత్రంలో పాల బేబీకి స్త్రీలంటే అపారమైన గౌరవం. వాళ్ళు కనిపిస్తే వాళ్ళ కాళ్ళు కడిగేస్తుంటాడు. వాళ్ళ మాటకి చాలా విలువ ఇస్తుంటాడు. వాళ్ళు అడిగితే ఎంత డబ్బైనా ఇచ్చేస్తూ ఉంటాడు. అది ఎందుకు అనే లాజిక్ మాత్రం సినిమాలో చూపించలేదు కానీ… హీరోయిన్లు మరియు వాళ్ళ అమ్మ, అమ్మమ్మల చేతిలో మోసపోయే పాత్రలో చూపించారు.
క్లైమాక్స్ లో కూడా అలీ నవ్వులు పూయిస్తాడు. ఇక ‘ఎఫ్3’ మూవీ సూపర్ హిట్ అవ్వడంతో చిత్ర బృందం ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్లో అలీ పాల్గొని కొన్ని సంచలన కామెంట్లు చేశాడు. అలీ మాట్లాడుతూ.. “అద్భుతమైన హిట్ ఇచ్చిన ప్రపంచంలోని తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్స్. ఈరోజు నిజమైన పండగు రోజు. సోమవారం కూడా హౌస్‌ఫుల్ అవ్వడానికి కారణం ఈ బ్యానర్ కు ఉన్న విలువ, దర్శకుడు అనిల్‌రావిపూడి, హీరోలైన వెంకటేష్, వరుణ్‌తేజ్ పై వున్న నమ్మకం.
సినిమా బాగుంటే ఎంత పెద్ద హిట్ ఇస్తారనేందుకు ‘ఎఫ్3’ నిదర్శనం. చాలామంది ఫోన్లు చేసి రెండు, మూడు సార్లు చూసాము అని చెబుతున్నారు. సినిమా హిట్ అయితే అందరూ బాగుంటారు. కొంతమంది హిట్ అయిన సినిమాను బాగోలేదని ప్రచారం చేస్తున్నారు. ఇలా చేయడం సరైందికాదని మనవి. ఎందుకంటే మీరుకూడా సినిమాను నమ్ముకున్నవారే కదా. గతంలో చెన్నైలో ఉండగా ఇలాంటి వార్తలు వినిపించేవికాదు. ఒకరి సినిమా హిట్ అయితే మరొకరు బాధపడడం ఏమిటో అర్థంకాదు.
అవతలివారు బాగుండాలి అని కోరుకుంటే దేవుడు మనల్ని బాగా చూస్తాడు. అనిల్‌గారు నా చేతికి గన్ ఇచ్చి చేయించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇది చాలా అద్భుతమైన పండుగ. అందులో నేను కూడా ఉండటం చాలా ఆనందంగా ఉంది” అంటూ చెప్పుకొచ్చారు. ఇంతకీ ‘ఎఫ్3’ సినిమా బాలేదు అని అలీ దగ్గర అన్న వాళ్ళు ఎవరో.. ఇండస్ట్రీలోని వ్యక్తులే అనే హింట్ ఇచ్చాడు కదా.!