సినీ పరిశ్రమలో మరో విషాదం.. అనారోగ్యంతో కన్నుమూసిన ప్రముఖ కమెడియన్!

  • May 3, 2023 / 02:12 PM IST

ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నో ఇబ్బందుల కారణంగా కొందరు ఆత్మహత్య చేసుకుంటూ మరణించగా మరి కొందరు అనారోగ్య సమస్యలతో మరణిస్తూ ఉన్నారు. గత రెండు రోజుల క్రితం కొరియోగ్రాఫర్ చైతన్య మరణ వార్త మర్చిపోకముందే ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ఎన్నో తెలుగు తమిళ భాషలలో కమెడియన్ గా తన నటనతో అందరిని మెప్పించిన కమెడియన్ మనోభాల (69) మరణించారు.

ఈయన తమిళ సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. అయితే ఈయనకు తెలుగులో కూడా ఎంతో మంచి ఆదరణ ఉందని చెప్పాలి. ఇలా కమెడియన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మనోభాల గత కొన్ని సంవత్సరాలగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.ఇలా అనారోగ్య సమస్యల కారణంగానే ఈయన ఇండస్ట్రీకి కూడా దూరమయ్యారు.

ఇలా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి మనోభాల నేడు తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ తుది శ్వాస విడిచారు. ఈ విధంగా ఈయన మరణ వార్త తెలియడంతో ఎంతోమంది సెలబ్రిటీలు, అభిమానులు విచారం వ్యక్తం చేస్తూ ఆయన మృతికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆయన ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus