’30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ’ అంటూ సినిమాల్లో తన కామెడీతో తెగ నవ్వించే పృథ్వీ.. ఇప్పుడు తీవ్ర అనర్యోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్ పాలయ్యాడు. దీంతో ‘అతనికి కరోనా సోకి ఉంటుంది’ అని అంతా అనుకుంటున్న తరుణంలో ఓ సేల్ఫీ వీడియోతో అందరి అనుమానాలకు క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో ద్వారా పృథ్వీ మాట్లాడుతూ.. “10 రోజులుగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నాను. అందులోనూ జలుబు తీవ్రంగా ఉండటంతో హాస్పిటల్ కు వెళ్లి అన్ని టెస్టులు చేయించుకున్నాను.
రిపోర్ట్స్ లో కోవిడ్ నెగెటివ్ అని వచ్చింది. ‘కానీ ఎందుకైనా మంచిది.. ఓ 15 రోజులు క్వారంటైన్లో జాయిన్ అవ్వండి’ అని డాక్టర్లు చెప్పడంతో నిన్న అర్థరాత్రి హాస్పిటల్ లో జాయిన్ అయ్యాను. త్వరగా కోలుకోవాలని భావిస్తున్నాను.అందుకు మీ అందరి ఆశీర్వాదంతో పాటు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఈయన మాట్లాడటానికి కూడా చాలా కష్టపడుతున్నట్టు ఈ వీడియో ద్వారా స్పష్టమవుతుంది.