Sudhakar: పవన్ కు ఫోన్ చేస్తే అలా రియాక్ట్ అయ్యారు.. సుధాకర్ కామెంట్స్ వైరల్!

  • August 14, 2024 / 11:51 AM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన కమెడియన్లలో సుధాకర్ (Sudhakar) ఒకరు. సీనియర్ నటుడు సుధాకర్ చిరంజీవి (Chiranjeevi) స్నేహితుడు అనే సంగతి తెలిసిందే. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన సుధాకర్ ఆ ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నన్ను అన్నయ్య అని పిలిచేవారని నా భార్యను వదిన అని పిలిచేవారని పవన్ ఎంతో ఆప్యాయతతో మాట్లాడేవారని అన్నారు.

Sudhakar

పవన్ కళ్యాణ్ అంటే నాకు కూడా ఎంతో ఇష్టమని సుధాకర్ పేర్కొన్నారు. చిరంజీవిపై ఎంత ప్రేమ ఉందో పవన్ కళ్యాణ్ అంటే కూడా అంతే ప్రేమ ఉందని సుధాకర్ పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఎన్నికై డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ కు ఫోన్ చేసి అభినందించానని సుధాకర్ (Sudhakar) వెల్లడించారు. తాను శుభాకాంక్షలు చెప్పడంతో పవన్ చాలా సంతోషించారని సుధాకర్ చెప్పుకొచ్చారు.

పవన్ కళ్యాణ్ సుధాకర్ కాంబినేషన్ లో మూడు సినిమాలు తెరకెక్కాయి. గోకులంలో సీత (Gokulamlo Seeta) , సుస్వాగతం (Suswagatham) , ఖుషి (Kushi) సినిమాలు తెరకెక్కగా ఈ సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి సక్సెస్ సాధించాయి. సంక్రాంతి సినిమా తర్వాత తాను సినిమాల్లో ఎక్కువగా నటించలేదని సుధాకర్ వెల్లడించారు. అనారోగ్య సమస్యల వల్ల సుధాకర్ సినిమాలకు దూరంగా ఉన్నారు. సుధాకర్ కొడుకు బెన్నీ పలు సినిమాలలో నటిస్తూ కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.

సుధాకర్ కొడుకు బెన్నీకి ఆశించిన స్థాయిలో బ్రేక్ అయితే రాలేదు. చిరంజీవి అంటే ఎంత ప్రేమో పవన్ కళ్యాణ్ అంటే కూడా అంతే ప్రేమ అని ఆయన చెప్పుకొచ్చారు. చిరంజీవి, పవన్ లపై సుధాకర్ అభిమానాన్ని చాటుకున్నారు. సుధాకర్ చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. సుధాకర్ వయస్సు 65 సంవత్సరాలు కాగా ఆయన ఇంటర్వ్యూలు కూడా ఎక్కువగా ఇవ్వడం లేదు.

రికార్డ్ స్థాయిలో విజయ్ మూవీకి బిజినెస్.. లియో రైట్స్ ను క్రాస్ చేసిందిగా!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus