సుహాస్ టు సత్యం రాజేష్.. గట్టిగానే గుంజుతున్నారుగా..!
April 20, 2024 / 11:32 PM IST
|Follow Us
కమెడియన్లు హీరోలుగా మారడం అనేది కొత్త విషయం కాదు. క్రేజ్ ఉంటే కమెడియన్లని హీరోలుగా పెట్టి సినిమాలు చేయడానికి నిర్మాతలు వెనుకడుగు వేయరు. అలా అని కమెడియన్లు హీరోలుగా చేసిన సినిమాలు సక్సెస్ అవుతున్నాయా? అంటే గతంలో లేదు. సునీల్ మాత్రం హీరోగా మారి కొంత కాలం ఓ వెలుగు వెలిగాడు. ఆ టైంలో అతని పారితోషికం రూ.3 కోట్ల వరకు ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో కమెడియన్లు హీరోలుగా మారి సక్సెస్.. లు అందుకుంటున్న సందర్భాలు ఉన్నాయి.
ఈ లిస్ట్ లో ముందుగా సుహాస్ (Suhas) వస్తాడని చెప్పొచ్చు. మొన్నామధ్య కొన్ని సినిమాల్లో కమెడియన్ గా అలరించాడు. ఆ తర్వాత పలు విలక్షణమైన పాత్రలు చేయడం కూడా జరిగింది. అయితే ఈ మధ్య పూర్తిస్థాయి హీరోగా సినిమాలు చేస్తున్నాడు. అన్నీ మినిమమ్ గ్యారంటీ అనే విధంగా ఆడుతున్నాయి. దీంతో అతని పారితోషికం రూ.2.5 కోట్ల వరకు పెరిగినట్టు ఇన్సైడ్ టాక్. అలాగే ప్రియదర్శి (Priyadarshi Pulikonda) కూడా హీరోగా మారాడు. ఇతని చేతిలో కూడా సినిమాలు బాగానే ఉన్నాయి.
‘బలగం’ (Balagam) ‘మల్లేశం’ (Mallesham) వంటి హిట్లు ఇతని ఖాతాలో ఉండటంతో పారితోషికం రూ.2 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు టాక్. వీరి బాటలోనే సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) కూడా హీరోగా మారిన సంగతి తెలిసిందే. ఇతని సినిమాలకి కూడా మంచి మార్కెట్ ఉంది. నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలోనే రూ.8 కోట్ల వరకు వస్తున్నాయి. దీంతో ఇతను కూడా కోటి నుండి కోటిన్నర వరకు డిమాండ్ చేస్తున్నారట.
అలాగే సత్యం రాజేష్ (Satyam Rajesh) కూడా రూ.60 లక్షల నుండి కోటి వరకు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఓటీటీ రైట్స్ రూపంలోనే వీళ్ళ సినిమాలకి రికవరీ జరిగిపోతుంది.. థియేట్రికల్ సక్సెస్ అయితే ఎక్కువ లాభాలు వస్తాయి. అదే వీళ్ళ పారితోషికాల వెనుక ఉన్న సీక్రెట్ అని చెప్పవచ్చు.