టాలీవుడ్ లో ఓటమి ఎరుగని దర్శకులు ఇద్దరే ఉన్నారు. ఒకరు రాజమౌళి కాగా మరొకరు కొరటాల శివ. స్టూడెంట్ నంబర్ వన్ తో మొదలైన రాజమౌళి విజయ యాత్ర బాహుబలి వరకు కొనసాగింది. ఆయన ఇప్పటి వరకు 11 సినిమాలు చేయగా వాటిలో బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. ఇక దర్శకుడు కొరటాల శివ సైతం ఓటమి ఎరుగని దర్శకుడిగా పరిశ్రమలో ఉన్నారు. రచయితగా అనేక చిత్రాలకు పనిచేసిన కొరటాల శివ, మిర్చి సినిమాతో డైరెక్టర్ గా మారారు.
ఆ మూవీ భారీ హిట్ అందుకోగా, ఆ తరువాత వచ్చిన శ్రీమంతుడు ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఇక ఎన్టీఆర్ తో చేసిన జనతా గ్యారేజ్, మహేష్ తో చేసిన భరత్ అనే నేను చిత్రాలు కూడా హిట్ అందుకున్నాయి. ఇలా కొరటాల చేసిన నాలుగు చిత్రాలు విజయం సాధించాయి. కాగా ఈ ఇద్దరు దర్శకులలో ఉన్న మరొక కామన్ పాయింట్ తమ రెండవ చిత్రంతో ఇండస్ట్రీ హిట్స్ కొట్టారు. స్టూడెంట్ నంబర్ వన్ తరువాత రెండేళ్లకు 2003లో ఎన్టీఆర్ తో రాజమౌళి సింహాద్రి తెరకెక్కించారు.
యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఆ చిత్రం ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగరాసింది. ఎన్టీఆర్ కి భారీ మాస్ ఫాలోయింగ్ ఆ చిత్రం తెచ్చిపెట్టింది. అలాగే కొరటాల శివ సైతం తన రెండవ చిత్రంతోనే ఇండస్ట్రీ హిట్ కొట్టారు. మొదటి చిత్రం మిర్చి తరువాత రెండేళ్లకు మహేష్ తో కొరటాల శ్రీమంతుడు చేశారు. సోషల్ కంటెంట్ తో కూడిన యాక్షన్ డ్రామాగా వచ్చిన ఆ మూవీ ఇండస్ట్రీ హిట్ కొట్టింది. భారీ వసూళ్లను సాధించిన శ్రీమంతుడు మూవీ నాన్ బాహుబలి రికార్డ్స్ నమోదు చేసింది. ఈవిధంగా మన టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ రెండో మూవీకే ఇండస్ట్రీ కొట్టారు.