Bigg Boss 5 Telugu: ప్రియాంక బుర్రలో ముందుగానే ఈ మాట షణ్ముక్ వేశాడా ?
November 30, 2021 / 09:47 AM IST
|Follow Us
బిగ్ బాస్ హౌస్ లో చాలా కూల్ గా 13వ వారం ఫుట్ బాల్ కిక్ తో నామినేషన్స్ అనేవి జరిగాయి. ఒకరి బాల్ ని ఒకరు గేట్ బైటకి తంతూ నామినేట్ చేసుకున్నారు. ఇందులో కెప్టెన్ షణ్ముక్, సన్నీ మినహా మిగతా ఇంటిసభ్యులు అందరూ నామినేట్ అయ్యారు. అయితే, నామినేషన్స్ కంటే ముందే చాలా విషయాలు హౌస్ మేట్స్ మాట్లాడుకున్నారు. ఎప్పటిలాగానే కాజల్ కూడా ఈవారం నామినేషన్స్ లో ఎవరెవరు ఉంటారు అంటూ ప్రిడిక్ట్ చేయడం స్టార్ట్ చేసింది. సన్నీని ఎవరు నామినేట్ చేయరు చూడండి అంటూ చెప్పింది. ఇక్కడే షణ్ముక్ ప్రియాంకతో చాలాసార్లు మాట్లాడుతూ కనిపించాడు. సన్నీ, కాజల్, మానస్ లు ముగ్గురూ కూడా నువ్వు నామినేట్ చేయవనే ధీమాలో ఉన్నారని, నువ్వు వాళ్లని ఏం చేయలేవ్ అని, ఎదురు చెప్పవని వాళ్ల ఫీలింగ్ అంటూ చిన్నగా ఇన్ఫులెన్స్ చేయడం మొదలుపెట్టాడు.
అంతేకాదు, కాజల్ అన్న కమ్యూనిటీ పాయింట్ పైన కూడా ఆమెని నామినేట్ చేయచ్చని హింట్ ఇచ్చాడు. దీంతో నామినేషన్స్ ప్రక్రియ స్టార్ట్ అవ్వగానే షణ్ముక్ ఈవిషయంతో కాజల్ ని నామినేట్ చేశాడు. అతిచాలా పెద్ద మాట అని, ఇలాంటి ఫ్లాట్ ఫార్మ్స్ పైన అలాంటి పెద్ద మాటలు మాట్లాడకూడదని నాకు నచ్చలేదంటూ నామినేట్ చేశాడు. చాలాసేపు కాజల్ ఈవిషయంపై ఆర్గ్యూ చేసింది. ఆతర్వాత వచ్చిన పింకీ తన దగ్గర రీజన్స్ లేకుండా ఎలా నామినేట్ చేయాలి బిగ్ బాస్ అంటూ టైమ్ వేస్ట్ చేసింది. బిగ్ బాస్ హెచ్చరికతో తప్పని పరిస్థితుల్లో సిరిని, ఇంకా కాజల్ ని నామినేట్ చేసింది. ఏదైతే కమ్యూనిటీ అని నియంత టాస్క్ లో కాజల్ పాయింట్ తీసుకుని వచ్చిందో ఆ పాయింట్ తోనే నామినేట్ చేసింది.
పింకీ నామినేషన్స్ తర్వాత మానస్ కి , శ్రీరామ్ కి గట్టి ఆర్గ్యూమెంట్ అయ్యింది. మళ్లీ వీళ్లు ఫస్ట్ వీక్స్ నుంచీ ఎలాగైతే మాటలతో కొట్టుకున్నారో ఇప్పుడు కూడా అదే పాయింట్ తో ఆర్గ్యూచేసుకుని ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు. ఐ తర్వాత కాజల్ కమ్యూనిటీ అనే పదం తప్పుమాట కాదని, ఒక గ్రూప్ ని కమ్యూనిటీ అని అంటారని చెప్పింది. నేను ఇది తీసుకుని రావడం ఆ టైమింగ్ కరక్ట్ కాదు కానీ, అది మంచికోసమే చెప్పానని గుర్తు చేసింది. దాన్ని మీరు తప్పు అని భూతద్దంలో చూడటం కరెక్ట్ కాదని చెప్పింది. కాజల్ సిరిని, ఇంకా ప్రియాంకని నామినేట్ చేసింది. దీంతో ఈవారం మొత్తం ఐదుగురు నామినేషన్స్ లోకి వచ్చారు.