వీరయ్య వర్సెస్ వీరసింహా.. ఆ సాంగ్ అదుర్స్ అంటూ?

  • December 25, 2022 / 07:05 PM IST

మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాతో సంక్రాంతి పండుగ సమయంలో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ రెండు సినిమాల నుంచి విడుదలవుతున్న ప్రతి సాంగ్ గురించి ప్రేక్షకుల మధ్య చర్చ జరుగుతోంది. వాల్తేరు వీరయ్య మూవీ నుంచి విడుదలైన బాస్ పార్టీ సాంగ్ ఆ సినిమాలో స్పెషల్ సాంగ్ కాగా వీరసింహారెడ్డి సినిమా నుంచి తాజాగా మా బావ మనోభావాలు అనే సాంగ్ విడుదలైంది.

ఈ రెండు సాంగ్స్ ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ సొంతం చేసుకుంటున్నాయి. బాస్ పార్టీ సాంగ్ కు దేవిశ్రీ సరికొత్త ట్యూన్ ప్లస్ కాగా మా బావ మనోభావాలు సాంగ్ కు థమన్ ట్యూన్ ప్లస్ అయింది. రెండు పాటల ట్యూన్స్ క్యాచీగా ఉండగా లిరిక్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. మాస్ ప్రేక్షకులకు బాస్ పార్టీ సాంగ్ నచ్చుతుండగా ఊరమాస్ ప్రేక్షకులకు మా బావ మనోభావాలు నచ్చుతోంది.

ఈ రెండు పాటలలో ఒక పాట ఎక్కువని మరో పాట తక్కువని చెప్పలేమని నెటిజన్లు చెబుతున్నారు. రెండు పాటలు బాగానే ఉన్నాయని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఈ రెండు సినిమాల కోసం దేవిశ్రీ ప్రసాద్, థమన్ తమ బెస్ట్ వర్క్ ఇచ్చారని కామెంట్లు వినిపిస్తున్నాయి. మాస్ ప్రేక్షకులకు తెగ నచ్చేలా దేవిశ్రీ, థమన్ జాగ్రత్తలు తీసుకుంటున్నారని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.

2020 సంక్రాంతికి ఒక్కరోజు గ్యాప్ లో సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో సినిమాలు విడుదలై సక్సెస్ సాధించాయి. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు కూడా ఒక్కరోజు గ్యాప్ లో రిలీజ్ కానుండగా ఈ రెండు సినిమాలు కూడా సక్సెస్ సాధించి రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. త్వరలో ఈ రెండు సినిమాలలో ఏ సినిమా ఎన్ని థియేటర్లలో విడుదల కానుందో క్లారిటీ రానుంది.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags