Jr NTR , Nagarjuna: ఎన్టీఆర్ నాగ్.. పై చేయి ఎవరిదో..?

  • July 10, 2021 / 01:01 PM IST

మూడేళ్ల క్రితం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ షోను హోస్ట్ చేసి ఆ షోను తన హోస్టింగ్ తో హిట్ చేసిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ నిర్వాహకులు సెకండ్ సీజన్ కు కూడా ఎన్టీఆర్ ను సంప్రదించినా కొన్ని కారణాల వల్ల ఎన్టీఆర్ ఆ షో సెకండ్ సీజన్ కు ఓకే చెప్పలేదు. అయితే చాలా కాలం తర్వాత జెమినీ టీవీలో ఎన్టీఆర్ హోస్ట్ గా ఎవరు మీలో కోటీశ్వరులు పేరుతో ఒక షో ప్రసారం కానుంది.

గతంలో స్టార్ మా ఛానెల్ లో ప్రసారమైన మీలో ఎవరు కోటీశ్వరుడు షోకు స్వల్పంగా మార్పులు చేసి జెమినీ ఛానల్ నిర్వాహకులు ఈ ప్రోగ్రామ్ ను ప్రసారం చేస్తున్నారు. అయితే మే నెలలో ప్రారంభం కావాల్సిన ఈ షో కరోనా సెకండ్ వేవ్ వల్ల ఆగష్టు నుంచి ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది. బిగ్ బాస్ సీజన్ 5 సెప్టెంబర్ నెల నుంచి నాగార్జున హోస్ట్ గా ప్రసారమయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

ఎన్టీఆర్, నాగార్జున షోలు బుల్లితెరపై ఒకే సమయంలో ప్రసారమైతే ఇద్దరు హీరోల మధ్య టీఆర్పీ రేటింగ్ ల విషయంలో పోటీ జరిగే అవకాశం ఉంటుంది. స్టార్ మా ఛానల్ తో పోలిస్తే జెమినీ ఛానల్ రీచ్ తక్కువనే సంగతి తెలిసిందే. బిగ్ బాస్ గత సీజన్లు టీఆర్పీ పరంగా కొత్త రికార్డులను క్రియేట్ చేశాయి. ఎన్టీఆర్, నాగ్ రియాలిటీ షోలలో ఏ షో పై చేయి సాధిస్తుందో చూడాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఈ రెండు షోల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుండటం గమనార్హం. బిగ్ బాస్ నిర్వాహకులు ఈ సీజన్ కు గత సీజన్లతో పోలిస్తే ఎక్కువ బడ్జెట్ ను కేటాయిస్తున్నారని సమాచారం.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus