ప్రముఖ నిర్మాత పై కేసు.. కారణం అదే..?

  • July 16, 2020 / 06:54 PM IST

ప్రముఖ నిర్మాత పై ఓ బిగ్ బాస్ కంటెస్టెంట్ క్రిమినల్ కేసు పెట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది. బాలీవుడ్ లో ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ నిర్మాత, దర్శకురాలు అయిన ఏక్తా కపూర్ పై వికాస్ పథక్ అనే బిగ్ బాస్ కంటెస్టెంట్ ముంబై మేజిస్ట్రేట్ కోర్టులో కేసు నమోదు చేశాడు. ఇటీవల ఏక్తా కపూర్ ‘అన్ సెన్సార్డ్ సీసన్ -2’ అనే వెబ్ సిరీస్ ను నిర్మించింది. ఇందులోని కొన్ని సన్నివేశాలు చాలా ఘోరంగా ఉన్నాయని పేర్కొంటూ క్రిమినల్ కేస్ పెట్టాడు వికాస్ పథక్.

ఈ వెబ్ సిరీస్ లో ‘ప్యార్ ఔర్ ప్లాస్టిక్’ అనే ఎపిసోడ్ లో ‘ఓ వ్యక్తి ఆర్మీ దుస్తులు ధరించి.. అసభ్యకరమైన డైలాగులు పలుకుతాడు’ అందుకే వికాస్ .. ఇలా ఏక్తా కపూర్ పై కేసు పెట్టినట్టు స్పష్టమవుతుంది. అంతేకాకుండా ఆర్మీ దుస్తులను అలాగే చిహ్నాన్ని అగౌరవంగా చూపించారని కూడా అతను కంప్లైంట్ లో పేర్కొన్నట్టు తెలుస్తుంది. ఈ కేసు పై ఆగష్టు 24న కోర్టులో విచారణ జరుగనున్నట్టు సమాచారం. ఇక ఏక్తా కపూర్ ఎక్కువగా బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలనే నిర్మిస్తూ వివాదాలను సృష్టిస్తుంటుంది.

‘సిల్క్ స్మిత’ జీవిత ఆధారంగా తెరకెక్కిన ‘డర్టీ పిక్చర్’ ను కూడా ఈమెనే నిర్మించింది. ఈమె నిర్మించే సినిమాలు ఎప్పుడూ వివాదాలను సృష్టించడంతో పాటు బాగా పాపులర్ అవుతూ ఉంటాయి. దాంతో ఆ పాపులారిటీ కూడా సినిమా కలెక్షన్స్ కు ఉపయోగపడుతుంటుంది. ఈమెకు కూడా ఇలాంటివి అలవాటే అని చెప్పాలి. ఇక వికాస్ పథక్… ‘బిగ్ బాస్ 13 సీజన్’ లో ఓ కంటెస్టెంట్ గా పాల్గొన్నాడు.

Most Recommended Video

15 డైరెక్టర్స్ కెరీర్ ను ఇబ్బందిలో పడేసిన సినిమాలు ఇవే!
కులాంతర వివాహాలు చేసుకొని ఆదర్శంగా నిలిచిన మన హీరోలు!
హీరోయిన్స్ కంటే ముందు బాలనటిగా అలరించిన తారల!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus