అతిలోకసుందరి మరణం వెనుక ఉన్న అనుమానాలు

  • February 26, 2018 / 03:45 PM IST

“శ్రీదేవి గుండెపోటుతో మరణించింది” శనివారం సాయంత్రం నుంచి సోమవారం మధ్యాహ్నం వరకూ మీడియాలో రచ్చ రచ్చ అయిన వార్త. కట్ చేస్తే.. కొద్ది గంటల ముందు గల్ఫ్ ప్రభుత్వం “శ్రీదేవి బాత్ టబ్ లో మునిగి ఊపిరాడక మృతి చెందింది” అంటూ రిపోర్ట్ ఇచ్చింది. దాంతో కధ అడ్డం తిరిగింది. ఇప్పుడు శ్రీదేవి మరణం వెనుక పెద్ద కాన్స్పిరెసీ ఉందని మీడియాతోపాటు జనాలకి కూడా అనుమానం వచ్చింది. అందుకు కారణాలు లేకపోలేదు.

రీజన్స్ ఫర్ డౌట్:
1. శ్రీదేవి ఆఖరి ఫోటోలు మరియు వీడియోగా ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నవి శ్రీదేవి స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ లో ఫిబ్రవరి 22న పోస్ట్ చేసింది.
2. అసలు శ్రీదేవి చనిపోయింది “హార్ట్ ఎటాక్” వల్ల అని మీడియాకి చెప్పింది ఎవరు?  అది అవాస్తవం అని తెలిసినప్పుడు బోణీకపూర్ లేదా అతని పి.ఆర్ డిపార్ట్ మెంట్ కానీ వెంటనే ఎందుకని స్పందించలేదు ?
3. ఫిబ్రవరి 22న వెడ్డింగ్ కి అటెండ్ అయిన శ్రీదేవి మళ్ళీ ఫిబ్రవరి 24 అర్ధరాత్రిన హాస్పిటల్లో జాయిన్ అయ్యేవరకూ ఎందుకని ఎవరికీ కనిపించలేదు ?
4. బోణీకపూర్ మొదటి భార్య కూడా ఇదే విధంగా అనుమానాస్పద మృతి చెందింది ?
5. 22వ తారీఖు రాత్రి పెళ్లి అనంతరం ముంబై వెళ్ళిపోయిన బోణీకపూర్ మళ్ళీ ఉన్నట్లుండి సడన్ డిన్నర్ అంటూ దుబాయ్ ఎందుకు వెళ్ళాడు ?
6. దాదాపు 50 ఏళ్ల యాక్టింగ్ కెరీర్ లో శ్రీదేవికి బాత్ టబ్ లో స్నానం చేయడం అనేది ఎంతకాదనుకొన్నా 15వ ఏట నుండే బాత్ టబ్ అనేది అలవాటు ఉంటుంది. అలాంటప్పుడు ఎంత ఎక్కువగా తాగినా కూడా తాను గత 30 ఏళ్లుగా స్నానం చేసే అలవాటున్న బాత్ టబ్ లో ఎందుకు మరణిస్తుంది ?
7. అమర్ సింగ్ అనే శ్రీదేవి ఫ్యామిలీ ఫ్రెండ్ అయితే అసలు శ్రీదేవికి మద్యం సేవించే అలవాటు లేదని చెబుతున్నాడు.
8. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో సిల్లీగా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎందుకున్నాయ్ ?
9. శ్రీదేవి పార్ధివ దేహాన్ని నిన్న అర్ధరాత్రి నుంచి దుబాయ్ ఎయిర్ పోర్ట్ లో ఉన్న ప్రయివేట్ జెట్ లోకి ఎక్కించడానికి దుబాయ్ ప్రభుత్వం ఎందుకు నిరాకరిస్తుంది ?
10. అన్నిటికీ మించి అసలు శ్రీదేవి మరణవార్తను ఎటూకాని సమాయమైన అర్ధరాత్రి ఒంటి గంటన్నరకు ఎందుకు ప్రకటించారు?

సో, ఇవన్నీ ప్రజలకు, రిపోర్టర్లకు వస్తున్న అనుమానాలు. వీటిలో ఏ ఒక్కదానికి సమాధానం దొరకచ్చు దొరక్కపోవచ్చు. అలాగే.. ఈ అనుమానాల వల్ల, ఈ గోల వల్ల మరణించిన శ్రీదేవి మళ్ళీ ప్రాణాలు పోసుకోదు. కానీ.. ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకొనే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. చెప్పాల్సిన అవసరం బోణీకపూర్ కుటుంబానికి, దుబాయ్ మరియు భారత ప్రభుత్వానికి ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus