Sunny: ఈ సీజన్ విన్నర్ ఎవరో ఫ్యామీలీ మెంబర్స్ హౌస్ మేట్స్ కి చెప్పేశారా..?

  • November 28, 2021 / 04:43 PM IST

బిగ్ బాస్ హౌస్ లో శనివారం జరిగిన టాస్క్ లో హౌస్ మేట్స్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి వారిని స్టేజ్ పైన పలకరించారు. అయితే, ఇక్కడే హౌస్ మేట్స్ వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ ని , ఫ్రెండ్స్ ని కలుసుకోవాలంటే మాత్రం ఏదైనా మీకు నచ్చిన వస్తువులని త్యాగం చేయాల్సి ఉంటుందని చెప్పాడు కింగ్ నాగార్జున. ఫస్ట్ యాంకర్ రవి పాప ఇచ్చిన బొమ్మని త్యాగం చేశాడు. దీంతో రవి వాళ్ల అమ్మ ఉమాదేవి స్టేజ్ పైకి వచ్చి రవితో కాసేపు మాట్లాడారు. నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉందని, రాజులు టాస్క్ లో నీ గేమ్ అదిరిపోయిందని, దీంతో నేను రాజమాత ని అయిపోయానని అన్నారు. అంతేకాదు, బిగ్ బాస్ సీజన్ 1 విన్నర్ అయిన శివబాలాజీ సైతం రవికోసం వచ్చి తనని ఎంకరేజ్ చేశాడు.

హౌస్ లో ఎవరికీ నువ్వు సపోర్ట్ చేయద్దని, అక్కడ్నుంచీ నీ పాయింట్ చెప్పి వెళ్లిపో అంటూ సలహా ఇచ్చాడు. దీని తర్వాత ఉమాదేవి , శివబాలాజీలు కలిసి టాప్ 5 ఎవరో చెప్పారు. రవి తర్వాత సన్నీ ఫోటోని పెట్టారు. ఆ తర్వాత శ్రీరామ్, షణ్ముక్, మానస్ ల ఫోటోలని పెట్టి టాప్ 5లో వీళ్లు ఉండాలని డిసైడ్ చేశారు. ఆ తర్వాత ప్రియంకా సింగ్ తన మేకప్ కిట్ ని త్యాగం చేసింది. పింకీ కోసం జబర్ధస్త్ ఫేమ్ సాయి, ఇంకా అప్పారావు వచ్చారు. వీళ్లు కూడా పీంకీకి తన గేమ్ గురించి సజెషన్స్ ఇచ్చారు. టాప్ 5లో సన్నీ, శ్రీరామ్, రవి, మానస్ ల పేర్లు చెప్పారు. వీళ్లు కూడా సన్నీని సెకండ్ ప్లేస్ లో పెట్టారు.

ఆ తర్వాత సన్నీ ఫ్రెండ్స్ వెంకట్, యూట్యూబ్ స్టార్ నిఖిల్ లు స్టేజ్ పైకి వచ్చారు. నిఖిల్ చాలాసేపు ఫన్ చేశాడు. కప్పు ముఖ్యం బిగిల్ అంటూ సన్నీని ఎంకరేజ్ చేశారు. దీంతో హౌస్ మేట్స్ కి సన్నీకి ఉన్న క్రేజ్ ఏంటో ఇండైరెక్ట్ గా అర్ధం అయిపోయింది. ఇక్కడే బోర్డ్ పైన సన్నీని విన్నర్ గా వాళ్లు అభిప్రాయ పడ్డారు. అంతేకాదు, ఆ తర్వాత షణ్ముక్, మానస్, శ్రీరామ్, కాజల్ లని టాప్ 5గా అభిప్రాయ పడ్డారు. ఇక మానస్ మదర్ ఇచ్చిన బ్రేస్ లెట్ ని త్యాగం చేస్తే, మానస్ తండ్రి వెంకట్రావ్ గారు, ఫ్రెండ్ అమర్ ఇద్దరూ స్టేజ్ పైకి వచ్చారు. ఏమీలేని నన్ను తీసుకుని వచ్చి ఆర్టిస్ట్ ని చేశాడు మానస్. వాడి రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను అంటూ చెప్పాడు అమర్ దీప్.

ఆ తర్వాత మానస్ ఫస్ట్ ప్లేస్ లో సన్నీ, కాజల్, శ్రీరామ్, షణ్ముక్ లు తర్వాత ప్లేస్ లలో ఉంటారని వాళ్లు అభిప్రాయ పడ్డారు. ఇక్కడ కూడా సన్నీ ఫోటోని సెకండ్ ప్లేస్ లో పిక్ చేశారు. నెక్ట్స్ కాజల్ బొమ్మని శాక్రిఫైజ్ చేసింది. కాజల్ ని కలవడానికి సింగర్ లిప్సిక, ఇంకా ఆమె సోదరి వచ్చారు. వీళ్లు కూడా కాజల్ గేమ్ గురించి మాట్లాడుతూ సన్నీ, షణ్ముక్, శ్రీరామ్ , మానస్ ల ఫోటోలని టాప్ 5లో పెట్టారు. ఇక్కడ కూడా సన్నీని సెకండ్ పిక్ గా వాళ్లు ఎంచుకున్నారు. ఇక శ్రీరామ్ వాళ్ల అమ్మగారు వచ్చి నిన్ను విన్నర్ గా చూడాలని ఉందని చెప్పారు. శ్రీరామ్ మదర్ రవి, ప్రియాంక, సన్నీ, షణ్ముక్ , ల ఫోటోలని పెట్టారు.

ఇక షణ్ముక్ కోసం లాస్ట్ లో వచ్చిన దీప్తి సునయన ఇంకా బ్రదర్ సంపత్ లూ కూడా వాళ్ల దృష్టిలో టాప్ 5 ఎవరో చెప్పారు. షణ్ముక్ ని ఫస్ట్ ప్లేస్ లో పెట్టిన వాళ్లు, శ్రీరామ్, సన్నీ, రవి, మానస్ లని నెక్ట్స్ ప్లేస్ లలో పెట్టారు. ఇక్కడే వచ్చిన ప్రతి ఒక్కరూ సన్నీ ఫోటోని పిక్ చేశారు. దీంతో హౌస్ మేట్స్ కి ఇండైరెక్ట్ గా సన్నీకి బాగా క్రేజ్ వస్తోందని తెలిసిపోయింది. అసలే చిన్న హింట్ దొరికినా కూడా గెస్ వర్క్ అనేది స్టార్ట్ చేసే తరుణంలో ఇలా ఫ్యామిలీ మెంబర్సే సన్నీకి సపోర్టింగ్ ఇవ్వడం అనేది అర్ధమైంది వాళ్లకి. దీంతో సన్నీని విన్నర్ గా చూస్తామా అనే సందేహం హౌస్ మేట్స్ కి వచ్చేసింది. అదీమేటర్.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus