జోష్ సినిమాతో కెరీర్ ను మొదలుపెట్టిన నాగచైతన్య ఆ సినిమాతో ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశపరిచారు. అయితే ఏ మాయ చేశావె, 100 % లవ్ సినిమాలతో చైతన్య ఖాతాలో విజయాలు చేరాయి. మాస్ సినిమాలు నాగ చైతన్యకు షాక్ ఇచ్చినా క్లాస్ సినిమాలతో చైతన్య బాక్సాఫీస్ వద్ద సత్తా చాటారు. మజిలీ, వెంకీ మామ, లవ్ స్టోరీ, బంగార్రాజు సినిమాల విజయాలతో నాగచైతన్య మార్కెట్ ను పెంచుకున్నారు. సినిమాకు హిట్ టాక్ వస్తే నాగచైతన్య సినిమాకు 40 కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి.
నాగచైతన్య ప్రస్తుతం ఒక్కో సినిమాకు 10 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. వరుసగా విజయాలు సాధిస్తుండటంతో చైతన్య రెమ్యునరేషన్ ఊహించని స్థాయిలో పెరిగింది. అదే సమయంలో చైతన్య సినిమాలను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య కూడా పెరుగుతోంది. చైతన్య సినిమా అంటే ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని చాలామంది భావిస్తున్నారు. సమంతతో చైతన్య విడిపోయినా చైతన్య కెరీర్ పై ఏ మాత్రం ప్రభావం పడలేదు.
థాంక్యూ సినిమాతో కూడా చైతన్య ఖాతాలో మరో సక్సెస్ చేరడం గ్యారంటీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. సినిమాల ఎంపిక విషయంలో చైతన్య ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చైతన్య తర్వాత సినిమా పరశురామ్ డైరెక్షన్ లో తెరకెక్కనుంది. గీతా గోవిందం, సర్కారు వారి పాట సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్న పరశురామ్ నాగచైతన్య సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాల్సి ఉంది.
ధూత అనే వెబ్ సిరీస్ లో చైతన్య నటిస్తుండగా ఈ వెబ్ సిరీస్ పై మంచి అంచనాలు నెలకొన్నాయి. స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటిస్తే నాగచైతన్య రేంజ్ మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. భవిష్యత్తులో కూడా నాగచైతన్య, సమంత కలిసి నటించే ఛాన్స్ లేదని సమాచారం అందుతోంది.
Most Recommended Video
పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!