విమర్శలు ఎదుర్కుంటున్న ప్రముఖుల జీవిత కథా చిత్రాలు!

  • July 12, 2018 / 02:33 PM IST

బాలీవుడ్, టాలీవుడ్ లోనూ ప్రముఖుల జీవిత కథలు తెరకెక్కుతున్నాయి. కమర్షియల్ గా విజయం సాధిస్తుండటంతో బయోపిక్ చిత్రాలపై ఫిల్మ్ మేకర్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. ఇవి భారీ కలక్షన్స్ తో పాటు.. భారీగా విమర్శలను ఎదుర్కొంటున్నాయి. కొంతకాలం క్రితం వచ్చిన ధోనీ బయోపిక్ మూవీ ఎటువంటి మచ్చ లేకుండా క్లీన్ హిట్ అందుకుంది. అయితే తాజాగా వచ్చిన “మహానటి”, “సంజు” చిత్రాలను విజయంతో పాటు విమర్శలను మూట గట్టుకుంది. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన “మహానటి” సావిత్రి కోణంలోనే ఉందని.. తమ తండ్రిని విలన్‌గా చూపించారంటూ.. జెమిని గణేశన్ మొదటి భార్య కూతురు కమల సెల్వరాజ్ విమర్శలు గుప్పించింది. సీనియర్ నటి రమా ప్రభ కూడా జెమిని గణేశన్ వల్లే సావిత్రి తాగుడుకు బానిస అయిందని చూపించడాన్ని వ్యతిరేకించారు.

ఇక బాలీవుడ్ లో కలక్షన్స్ వర్షం కురిపిస్తున్న “సంజు” సినిమాలో కూడా ఒక వైపు మాత్రమే చూపించారని అక్కడి సినీ విశ్లేషకులు చెబుతున్నారు. సంజయ్ దత్  దర్శకుడు రాజ్ కుమార్ హిరాణి మిత్రుడు కాబట్టి మంచి మాత్రమే తెరకెక్కించారని వాపోతున్నారు. ప్రస్తుతం తెలుగులో మహానటుడు నందమూరి తారక రామారావు బయోపిక్ మూవీని క్రిష్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం విడుదలకాకముందే విమర్శలు ఎదుర్కుంటోంది. బయోపిక్ అంటే ఎన్టీఆర్ లైఫ్ లోని మంచి చెడులను చూపించాలని సవాలు విసురుతున్నారు. అయితే అలా చూపిస్తే ఇబ్బంది అవుతుందని గ్రహించిన బాలయ్య తన తండ్రి జీవితంలోని ఒక వైపు మాత్రమే చిత్రీకరిస్తున్నారని టాక్. ఇది ఒక విధమైన వ్యాపార మంత్రమని సమర్థిస్తున్న ట్రేడ్ వర్గాల వారు లేకపోలేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus