ఆ సన్నివేశాలు తొలగించకుంటే సినిమా ఆపేస్తామంటున్నారు

  • October 16, 2018 / 05:20 AM IST

త్రివిక్రమ్-ఎన్టీఆర్ ల క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కిన “అరవింద సమేత” గతవారం విడుదలై ఘన విజయం సాధించడమే కాక తొలివారంలోనే 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. అయితే.. ఈ సినిమాపై ఇప్పుడు కొత్త గొడవలు మొదలయ్యాయి. ఈ సినిమా కథ నాది అంటూ ఓ ప్రముఖ రచయిత “త్రివిక్రమ్ ఒక మొండి కత్తి” అనే వ్యాసాన్ని రాసి ఫేస్ బుక్ లో పెట్టడంతో.. అది వైరల్ అయ్యింది. అలాగే.. ఆ మొండి కత్తి ఎపిసోడ్ మొత్తాన్ని త్రివిక్రమ్ “ది ఫ్యామిలీ” అనే హాలీవుడ్ సినిమా నుంచి కాపీ కొట్టాడని కూడా చెబుతున్నారు విశ్లేషకులు. అయితే.. ఇప్పుడు ఈ సినిమాపై మరో కొత్త గొడవ మొదలైంది.

రాయలసీమ పరువు తీసే విధంగా సినిమా ఉందని కొందరు రాయలసీమకు చెందిన పెద్ద మనుషులు సినిమాపై తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేయడమే కాదు.. అర్జెంట్ గా అలా అవమానిస్తున్నట్లుగా ఉన్న సన్నివేశాలను సినిమా నుంచి తొలగించకపోతే రాయలసీమలో సినిమాని నిపివేస్తామని బహిరంగంగా ప్రకటించారు. ఈ విషయమై సినిమా యూనిట్ నుంచి ఎవరో ఒకరు స్పందించాల్సి ఉన్నప్పటికీ.. ఎవరూ ఇంకా పట్టించుకోకపోవడంతో ఈ ఇష్యూ సీరియస్సా లేక మిగతా అల్లర్ల వలె లైటా అనేది తెలియాల్సి ఉంది. కానీ.. ఈమధ్యకాలంలో ఏ సినిమాపై రానన్ని కంప్లైంట్స్ ఈ సినిమాపై వస్తుండడంతో ఎన్టీఆర్ అభిమానులు మాత్రం చాలా బాధపడుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus