హాలీవుడ్ నుంచి మలయాళంలోకి.. అక్కడ నుంచి తెలుగులోకి వచ్చిన కథ!
September 29, 2018 / 01:40 PM IST
|Follow Us
శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని కలిసి చేసిన మల్టీస్టారర్ మూవీ దేవదాస్. అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ అయి మిశ్రమ స్పందన అందుకుంది. ఈ సినిమాలో నాగార్జున డాన్ గా, నాని వైద్యుడిగా నటిస్తున్నట్లు వార్తలు బయటికి రాగానే ఇది హాలీవుడ్ సినిమాకి రీమేక్ అని విమర్శకులు చెప్పారు. చిత్ర బృందం ఖండించగానే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగారు. చివరకు దేవదాస్ కాపీ కథే అని తేల్చి చెప్పారు. హెరాల్డ్ రామిస్ డైరెక్ట్ చేసిన హాలీవుడ్ మూవీ “ఎనలైజ్ దిస్” లో రాబర్ట్ డీ నీరో, బిల్లీ క్రిస్టల్ ప్రధాన పాత్రలు పోషించారు. 1999లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది.
ఇదే సినిమాను మలయాళంలో మమ్ముట్టి, శ్రీనివాసన్ ప్రధాన పాత్రధారులుగా “భార్గవ చరితం మూన్నాం ఖండం” పేరుతో రీమేక్ చేశారు. మమ్ముట్టి డాన్ గా నటించగా శ్రీనివాసన్ డాక్టర్ గా నటించాడు. హాస్యంతో తెరకెక్కిన ఆ చిత్రం మలయాళంలో ప్లాప్ అయ్యింది. అయితే వారు ఇది కాపీ కథ అని ఒప్పుకున్నారు. కానీ దేవదాస్ టీమ్ మాత్రం ఒప్పుకోలేదు. తీరా సినిమా రిలీజ్ అయిన తర్వాత చూస్తే హీరోయిజం కోసం ఫైట్స్ ఎక్కువగా పెట్టారు. అదే ఈ రెండు కథల్లో తేడా. మరి ఇక్కడ ఫలితం ఎలా ఉంటుందో ఈ వారంలో చివరి నాటికీ తెలిసిపోతుంది.