సినీ పరిశ్రమలో కథల కాపీ విషయంలో గొడవలు అనేవి ఎప్పుడు ఉండేవే. ఇలా కథ నాదంటే నాదని అనుకున్న సందర్భాలు పెద్ద సినిమాలకి సైతం తప్పలేదు. అయితే త్రిష, విజయ్ సేతుపతి జంటగా ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన 96 సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది.
ఇక విషయంలోకి వెళితే, దర్శకుడు భారతీరాజా తన అసిస్టెంట్ రాసుకున్న ఈ కథ ఒక ఫ్రెండ్ ద్వారా వారి వద్దకు వెళ్ళిందంటూ, తన అసిస్టెంట్ కథని కాపీ కొట్టి సినిమా తీశారంటూ తెలిపారు. అయితే ఇదే విషయం పైన స్పందించిన డైరెక్టర్ ప్రేమ్ కుమార్ అసలు వారి వాదనలో నిజం లేదని, సినిమా మంచి విజయం సాధించినందుకు ఇలా కొందరు కక్ష్య కట్టి చేస్తున్నారని, అవసరమైతే ఈ విషయం పైన చట్ట పరంగా వెళ్ళడానికి అయినా సిద్ధం అంటూ తెలిపారు.