మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కూడా తన తమ్ముడు చరణ్ లాగా.. నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆమె భర్త విష్ణుతో కలిసి ‘గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్మెంట్స్’ అనే సంస్థను స్థాపించి మొదటి ప్రయత్నంగా పలు వెబ్ సిరీస్ లు నిర్మించడానికి రెడీ అయ్యింది సుస్మిత. మొదటి వెబ్ సిరీస్ ను ‘ఓయ్’ ఫేమ్ ఆనంద్ రంగా డైరెక్షన్లో చెయ్యడానికి రెడీ అయ్యింది. జీ5 వారితో ఒప్పందం కూడా కుదుర్చుకుందట.
తన మావయ్య అల్లు అరవింద్ ‘ఆహా’ కోసం కూడా పలు వెబ్ సిరీస్ లను నిర్మించడానికి కూడా స్క్రిప్ట్ లు వింటుంది. ఇదిలా ఉండగా.. ఈ మధ్యనే తన తల్లి సురేఖ చేతుల మీదుగా ‘ఎక్స్ ఛేంజ్ ఆఫ్ ఫైర్’ అనే టైటిల్ తో వెబ్ సిరీస్ ను ప్రారంభించింది. ప్రకాష్ రాజ్, సంపత్ లు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ వెబ్ సిరీస్ కు సంబంధించి.. ఇప్పటికే కొన్ని ఎపిసోడ్స్ ను కూడా షూట్ చేశారట. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా..
ఈ వెబ్ సిరీస్ కోసం పనిచేస్తున్న టీమ్ లో ఒకరు కరోనాకు గురయ్యినట్టు సమాచారం. దీంతో షూటింగ్ ను తాత్కాలికంగా ఆపేశారట. దీంతో ఈ వెబ్ సిరీస్ కోసం పనిచేస్తున్న వారంతా కరోనా టెస్టులు చేయించుకుంటున్నారని తెలుస్తుంది. అటు తరువాత 14 రోజులు హోమ్ క్వారంటైన్ లో ఉండాలని కూడా నిర్మాత సుస్మిత సూచించారట.