Shah Rukh Khan son Aryan: ఆర్యన్ బెయిల్ పిటిషన్.. కొట్టి పారేసిన కోర్టు!
October 5, 2021 / 02:19 PM IST
|Follow Us
డ్రగ్స్ కేసులో బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ను ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం ఎనిమిది మందిని పోలీసు అరెస్ట్ చేశారు. విచారణలో ఉన్న ఆర్యన్ ను వైద్య పరీక్షలు చేయించిన అనంతరం కోర్టులో హాజరు పరిచారు. ఈ క్రమంలో ఆర్యన్ తరఫు న్యాయవాది కోర్టులో బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా కోర్టు ఆర్యన్ కు బెయిల్ నిరాకరిస్తూ ఆ పిటిషన్ ను కొట్టిపారేసింది.
మరోవైపు ఆర్యన్ ను ఈ నెల 7వ తేదీ వరకు కస్టడీకి ఇవ్వాల్సిందిగా ఎన్సీబీ కోర్టును కోరింది. ఇప్పటికే ఆర్యన్ విచారణలో ఆసక్తికర విషయాలు వెల్లడించాడని సమాచారం. నాలుగేళ్లుగా తను డ్రగ్స్ తీసుకుంటున్న విషయాన్ని ఆర్యన్ ఎన్సీబీ అధికారులకు చెప్పాడట. ఇండియాలోనే కాకుండా యూకే, దుబాయ్ లలో కూడా డ్రగ్స్ సేవించినట్లు చెప్పినట్లు సమాచారం. ముంబై తీరంలో ఒక క్రూజ్ షిప్ లో రేవ్ పార్టీ జరుగుతుందని సమాచారం అందుకున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) శనివారం రాత్రి దాడి చేసిన సంగతి తెలిసిందే.
ఈ పార్టీలో పెద్ద ఎత్తున డ్రగ్స్ వినియోగించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. డ్రగ్స్ పెడ్లర్లతో ఆర్యన్ అనేకసార్లు వాట్సాప్ చాటింగ్ చేసినట్లు ఎన్సీబీ అధికారులు గుర్తించారు. ఆర్యన్ ఖాన్ ఫోన్ ను అధికారులు సీజ్ చేశారు.